యువత కోసం ఆధునిక స్నూకర్ సిండికేట్.. ఆల్వాల్‌లో ఈటెల ఘన ప్రారంభం.|

0
285

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్  నిన్న రాత్రి ముఖ్య అతిథిగా హాజరై స్నూకర్ సిండికేట్ ఇండోర్ ఆట స్థలాన్ని ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్నూకర్ వంటి ఆటలు ఏకాగ్రత, సహనం, వ్యూహాత్మక ఆలోచనలను అభివృద్ధి చేస్తాయని అన్నారు. నేటి యువత క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.

అలాగే, ఇలాంటి ఆధునిక క్రీడా వేదికలు ప్రాంతీయ యువతకు మంచి అవకాశాలను అందిస్తాయని, భవిష్యత్తులో ఇక్కడి నుంచే ప్రతిభావంతులు వెలుగులోకి రావాలని అయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మతో పాటు సీనియర్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, ఉదయ్ ప్రకాశ్, సూర్య, అశోక్, ప్రణయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్నూకర్ సిండికేట్ యజమానులు చందు రావు మరియు నిర్వాహకులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
SURAKSHA
Praveen Kumar Sinha, IPS: Championing Modern Punjab Policing
A distinguished 1994-batch Punjab Cadre IPS officer, Shri Praveen Kumar Sinha has built an...
By Lokeshwari Panthadi 2026-07-17 12:24:42 0 423
SURAKSHA
Surendra Singh Yadav IPS: A Leader Shaping Modern Policing
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to public safety, technology-driven...
By Kalaga Sailaja 2026-07-22 10:55:55 0 154
BMA
Exposing Contractors: Journalist Beaten for Two Hours
Regional reporters frequently face extreme violence without corporate backing. In May 2025,...
By JoinBMA 2026-08-21 09:47:00 0 151
Andhra Pradesh
పొలిటికల్ పార్టీ లతో ఆర్డిఓ గారు సమావేశం
చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల...
By Gadiyapudi Narendra 2026-03-26 17:23:08 0 580
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర వేడుకలతో...
By John Baji 2026-01-02 12:46:13 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com