కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు.. ఆదివారం వన్‌వే ట్రయల్.|

0
323

హైదరాబాద్ : నగర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం... కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వన్‌వే ట్రయల్ అమలు చేయబడుతుందని తెలిపారు. ఈ ట్రయల్‌లో భాగంగా కొన్ని ప్రధాన రహదారులపై వాహన రాకపోకలకు మార్పులు ఉంటాయని చెప్పారు. ట్రయల్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇదే మార్గాలను శాశ్వతంగా అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.

పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్ 2 ద్వారా ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, 10 మీదుగా రోడ్ నెంబర్ 45కి మళ్లించనున్నారు. అలాగే మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ముందుగా రోడ్ నెంబర్ 2 వైపు మళ్లించనున్నారు.

రోడ్ నెంబర్ 10, 12 ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మార్గంలో జూబ్లీ చెక్‌పోస్ట్ ద్వారా కేబీఆర్ పార్క్ చేరుకునేలా డైవర్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ట్రాఫిక్ మార్పులను గమనించి, పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని నగర ప్రజలను కోరారు.

#sidhumaroju 

Alwal

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు
పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల...
By Kothuru Murali 2026-06-08 14:26:25 0 120
Andhra Pradesh
మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-06-22 06:36:58 0 115
Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
    ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.    శాసనసభ, శాసన మండలిలో...
By Ellandula Sandeep 2025-12-29 04:32:03 0 655
SURAKSHA
Shri Amitabh Ranjan IPS: A Legacy of Courage and Service
A distinguished 1988-batch Tripura cadre IPS officer whose decades of leadership, integrity, and...
By Kalaga Sailaja 2026-07-22 07:25:42 0 80
Andhra Pradesh
కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు.
ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్‌ ప్రతిపాదన విశాఖ...
By Pagadala Venkateswar 2026-07-09 05:40:45 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com