ఉద్యోగులకు 7358 కోట్ల పెండింగ్ బిల్లు విడుదల గ్రీన్ సిగ్నల్

0
479

*Press Release*

 

*ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్*

 

*ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా... పెండింగ్ బిల్లులను చెల్లించాలని సీఎం ఆదేశం*

 

*బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి సూచన*

 

*పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష*

 

*అమరావతి, ఏప్రిల్ 1:-* గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. సీఎం సూచనల మేరకు కసరత్తు చేశామని... నిధుల లభ్యతను బట్టి చెల్లింపులను జరుపుతున్నామని అధికారులు వివరించారు. ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వీటితో పాటు గ్రాట్యుటీ బకాయిల కింద రూ. 3,411 కోట్లు, పెండింగులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ. 1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవుల నిమిత్తం రూ. 223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని మరో రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతోంది ఉద్యోగులకు మాత్రమేనని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సహా అన్ని రకాల పెండింగ్ బిల్లులకు చెల్లింపులు జరపాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. నాడు ఉద్యోగుల సొంత సొమ్మును కూడా నాటి ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తమ నిధుల కోసం ప్రశ్నించిన నేతలపై కేసులు పెట్టి వేధించారనే అంశం చర్చకు వచ్చింది. ఇక ఇదే సమీక్షా సమావేశంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు, మెటిరీయల్ సరఫరా చేసిన వారికి జరపాల్సిన చెల్లింపులపైనా సీఎం ఆరా తీశారు. వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల బకాయిల చెల్లింపులు జరిపామని అధికారులు తెలిపారు. పనులు చేసిన, మెటిరీయల్ సరఫరా చేసిన వాళ్లకు బిల్లులు చెల్లింపులు జరిపే ప్రక్రియలో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Search
Categories
Read More
Rajasthan
Eco Restraint: GRAM 2026 Postponed For Fuel Conservation
In a significant move aligning with Prime Minister Narendra Modi’s public appeal for...
By Dunna Jessicaruth 2026-05-16 08:16:04 0 194
Telangana
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి.
BREAKING    గోశామహల్ ఎమ్మెల్యే,  రాజాసింగ్ బీజేపీ పార్టీ కి.. ఎమ్మెల్యే పదవికి...
By Sidhu Maroju 2025-07-11 08:51:49 0 1K
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం...
By Pagadala Venkateswar 2026-06-26 03:13:20 0 87
Andhra Pradesh
ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం కీలకమైన ప్రాధాన్యాన్ని...
By Pagadala Venkateswar 2026-09-02 09:20:18 0 97
Telangana
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
By Ponnala Srinivasrao 2026-03-16 11:07:20 0 288
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com