స్టేడియాలు ఓపెన్ పబ్‌లా?.. కాన్సర్ట్‌ల తర్వాత చెత్త రాజ్యం.|

0
264

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో క్రీడా మైదానాల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌ల తర్వాత స్టేడియాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. క్రీడాకారుల సాధనకు ఉద్దేశించిన మైదానాలు ఇప్పుడు ఓపెన్ పబ్‌లుగా మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్‌తో ప్రారంభమైన ఈ ట్రెండ్, ఇటీవల అనిరుద్ రవిచందర్ లైవ్ షో, మూడు రోజుల క్రితం ఇలయరాజా సంగీత విభావరి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాలన్నీ గచ్చిబౌలి స్టేడియం ను వినోద కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాయి.

ఈ భారీ ఈవెంట్ల తర్వాత స్టేడియంలో కనిపించిన దృశ్యాలు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. బీరు సీసాలు, మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు మైదానమంతా పేరుకుపోవడంతో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతింది. క్రీడలకు అనువైన వాతావరణం లేకుండా పోతుందని క్రీడాకారులు వాపోతున్నారు.

ఇదే పరిస్థితి ఎల్.బి. స్టేడియం లోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు క్రీడా పోటీలకు ప్రసిద్ధి చెందిన ఈ స్టేడియం ప్రస్తుతం సినిమా షూటింగ్లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, క్రిస్మస్ వేడుకలు, ఇఫ్తార్ విందులు, రాజకీయ సభలు, కుల సమావేశాలకు వేదికగా మారింది.

ప్రత్యేకంగా మద్యం వినియోగం నియంత్రణ లేకుండా సాగుతుండటంతో స్టేడియాలు ఓపెన్ పబ్‌లుగా మారుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల మైదానాలు చెత్తాచెదారంతో నిండిపోతూ, క్రీడాకారుల సాధనకు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి.

క్రీడాభివృద్ధి కోసం నిర్మించిన ఈ వేదికలు వినోద కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతాయా?  లేక క్రీడాకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: జర్నలిస్టులకు ఉచిత హెల్త్‌కార్డ్ పాంపిని
నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జర్నలిస్టులకు వెల్నెస్ ఆసుపత్రి అందించిన ఉచిత హెల్త్ కార్డుల...
By Sadaq Sadaq 2026-04-25 09:29:22 0 150
Telangana
TG : రిజర్వేషన్లు— హైకోర్టు కీలక వ్యాఖ్యలు
 హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(శనివారం, సెప్టెంబర్‌ 27)...
By Sidhu Maroju 2025-09-27 15:36:28 0 325
Telangana
సుప్రీంకోర్టు న్యాయవాది మీద పగ తీర్చుకున్నా హైడ్రా కమిషనర్‌ ?
సుప్రీంకోర్టు న్యాయవాది మీద హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పగ తీర్చుకున్నారంటూ...
By Ponnala Srinivasrao 2026-04-14 01:32:55 0 183
Telangana
ఆసిఫాబాద్ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఐఐటీయూసీ AITUC డిమాండ్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్: ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేయడం...
By Chunarkar Jagadeesh 2026-07-28 11:52:39 0 387
Jammu & Kashmir
J&K Expands Renewable Energy and Hydropower Projects
Jammu & Kashmir continues to strengthen its renewable energy sector in 2026 by advancing...
By Fathima Safa 2026-07-04 08:39:37 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com