చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
362

చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి.

ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ కుట్రను ఖండిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేనేతల సర్వసభ్య సమావేశం ఎదుట భారీ స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రానికి గర్వకారణమైన ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని బలహీనపరచే ఈ నిర్ణయం చేనేత కార్మికుల కడుపుపై కొట్టినట్టేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిధంగా, ఎమ్మిగనూరు చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు నిర్మించిన ఈ గొప్ప వ్యవస్థను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

చేనేతను కాపాడాలి – విలీనాన్ని రద్దు చేయాలి.

మాచాని సోమప్ప గారి ఆశయాలు నిలబెట్టాలి.

కార్మికుల హక్కులు మా హక్కులు.

ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక సహించము.అంటూ నినాదాలతో ప్రాంతం మారుమోగింది.ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామని ప్రభుత్వం మీద గట్టిగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ నాయకులు, జడ్పిటిసిలు,ఎంపీపీలు ఎంపీటీసీలు,సర్పంచులు వార్డు మెంబర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎర్రకోట కుటుంబ అభిమానాలు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం...
By Chennaiah Kati 2026-07-24 07:44:05 0 221
Telangana
నిజామాబాద్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి...
By Sadaq Sadaq 2026-05-26 02:55:22 0 107
Andhra Pradesh
SDG లక్ష్యాలు 100% దాటాలి
గుంటూరు ఫిబ్రవరి 04: జిల్లాలో స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సూచికలు నూరుశాతం...
By John Baji 2026-02-04 12:53:02 0 628
Andhra Pradesh
చిన్న ముక్క పల్లెలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
      *గడువు జూలై 24 వరకు పొడిగింపు.. అర్హులంతా ఎస్‌ఆర్‌ఎఫ్ ఫారాలు...
By Benguluri Madhubabu 2026-07-14 13:07:08 0 249
Chhattisgarh
MSP Hike Sparks Joy for Chhattisgarh Farmers
The recent Union Cabinet decision to increase the Minimum Support Price (MSP) for 14 Kharif crops...
By Dunna Jessicaruth 2026-05-15 09:08:15 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com