Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.

0
353

 

 

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

30-03-2026 Mon 19:15 | Both States

Tirumala Devotee Rush Decreases Slightly

షార్ట్స్‌లో చూడండి

తిరుమల కొండపై భక్తుల రద్దీ కాస్త తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల తాకిడి సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.

 

నిన్న ఆదివారం (మార్చి 29) నాడు మొత్తం 80,774 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,447 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆదివారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లుగా నమోదైంది.

 

సాధారణంగా వారాంతాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండి, కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోతుంటాయి. అయితే, వారాంతం ముగియడంతో ప్రస్తుతం రద్దీ కాస్త అదుపులో ఉంది. భక్తులు తక్కువ సమయంలోనే దర్శనం చేసుకుంటున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట
నరసరావుపేట :-  ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ...
By Bhesetti Lovaraju 2026-01-29 13:22:43 0 658
Telangana
₹18 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సబిత అనిల్ కిషోర్ గౌడ్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక...
By Sidhu Maroju 2026-02-08 13:39:35 0 258
SURAKSHA
TN Police Vigilant Against Illegal Liquor Smuggling
Yesterday, the Tamil Nadu Police intensified vehicle inspections at state borders. They...
By Kalaga Sailaja 2026-06-27 11:41:07 0 162
Andhra Pradesh
సైట్ ఇంజనీర్లు, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 4 సైట్ ఇంజనీర్, 3 డ్రాఫ్ట్స్‌మన్...
By Pagadala Venkateswar 2026-05-08 05:27:43 0 148
Telangana
Spandana takshana rakshana teams
హైదరాబాద్‌ ఐసీసీసీ వేదికగా 'స్పందన' తక్షణ రక్షణ బృందాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న...
By G k Nookala 2026-04-27 12:02:35 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com