హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం

0
241

చరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్‌బండ్ వంటి వాటితో పాటు, ఇప్పుడు హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో HMDA నిర్మించిన ఎకో పార్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్వాల్‌గూడలో రూపుదిద్దుకున్న ఈ పార్కులో దేశవిదేశాలకు చెందిన 19 రకాల అరుదైన పక్షులు ఉన్నాయి.

‎ఇక నుంచి అరుదైన, అందమైన పక్షులను చూడాలంటే ఆఫ్రికా అడవులకో, అమెజాన్ నదీ తీరాలకో వెళ్లాల్సిన పని లేదు. నగరవాసుల కోసం హిమాయత్‌సాగర్ చెంతన 85 ఎకరాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ఎకో పార్కును అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవిదేశాలకు చెందిన పక్షులతో కొత్వాల్‌గూడలో ఎకోపార్క్ నిర్మించారు

‎ఎకో పార్కులో మొత్తం ఆరు ఎకరాల్లో పక్షిశాల సిద్ధమైంది. దీనిని ప్రత్యేకంగా సీతాకోకచిలుక ఆకారంలో రూపొందించారు.

‎ఈ ఎకో పార్కులో 19 రకాలకు చెందిన సుమారు 8,094 పక్షులు ఉన్నాయి.

‎ఆఫ్రికా గడ్డి మైదానాలు, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, న్యూజిలాండ్, పెరూ, అర్జెంటీనా వంటి సుదూర ప్రాంతాల్లో కనిపించే అరుదైన పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు.

‎పలు రకాలైన మకావ్‌లు, కాకాటెయిల్స్, బడ్డీ, పావురాలు, ఫించ్, ఇంద్రధనుస్సు చిలుకలు, కాకాటూలు, అమెజాన్ చిలుకలు, కోనూర్స్, ఫెసెంట్స్, టురాకో, టూకాన్‌లు, మాండ్రిన్ బాతులు, క్వేకర్ చిలుకలు వంటి పలు రకాల పక్షులు ఇక్కడ ఆకర్షణగా నిలవనున్నాయి.

‎పక్షుల మనుగడకు అనువుగా ప్రత్యేకమైన గేజ్‌లు ఏర్పాటు చేసి, వాటి సహజ ఆవాసాలకు దగ్గరగా ఉండేలా కృత్రిమ వాతావరణాన్ని సృష్టించారు.

‎పక్షిశాల ఐటీ కారిడార్‌ను, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఆనుకొని ఉండటం వల్ల నగరవాసులకు, పర్యాటకులకు సులభంగా చేరుకోవడానికి వీలు కలుగుతుంది.

‎అద్భుతమైన పక్షి ప్రదర్శనశాల హైదరాబాద్‌కు మరో పర్యాటక ఆకర్షణగా మారనుంది. పక్షుల ప్రియులకు కనుల పండుగ చేయనుంది. త్వరలో పార్క్ ప్రారంభం కానుండగా.. వీకెండ్ ప్లాన్ చేసుకునేవారు ఎకో పార్కుపై ఓ లుక్కేయండి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...
By Kothuru Murali 2026-01-19 12:06:45 0 228
Andhra Pradesh
జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.
  జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు 04-05-2026 Mon 07:39 | Both States...
By Pagadala Venkateswar 2026-05-04 06:08:50 0 121
Andhra Pradesh
మదనపల్లె: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం-కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-05-30 05:10:23 0 125
Tamilnadu
Tamilnadu tvk party
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500...
By G k Nookala 2026-03-07 18:00:11 0 342
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం డ్రంకన్ డ్రైవ్ వాహనాలు చెక్ చేస్తున్న ఎస్ఐ వెంకట్ రమణ
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఎస్సై వెంకట్ రమణ డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను చెక్ చేస్తూ...
By Chennaiah Kati 2026-02-01 18:41:13 0 351
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com