కృష్ణ మిల్క్ యూనియన్ 36వ సర్వసభ్య సమావేశం

0
278

కృష్ణా మిల్క్ యూనియన్ 36 వ సర్వ సభ్య సమావేశం 

పాల సేకరణ ధర పెంపు - భారత దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధర మరియు బోనస్ చెల్లిస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్.

 

28.03.2026 మధ్యాహ్నం 02.00 గంటలకు కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు గారి అధ్యక్షతన పత్రికా సమావేశము ఏర్పాటు చేయటం జరిగినది. 

కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీ ఆవరణ లో 36 వ సర్వ సభ్య సమావేశం ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సర్వ సభ్య సమావేశం సందర్భముగా ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ రైతు పక్షపాతిగా పేరుపొందిన కృష్ణా మిల్క్ యూనియన్, మరోసారి పాడి రైతులకు మరింత తోడ్పాటును అందించాలనే కృత నిశ్చయంతో సమితి పాల సేకరణ ధరను లీటరుకు 10% వెన్న గల పాలకు కేజీ ప్యాట్ కు రూ.30/- రేటును పెంచి, కేజీ ప్యాట్ కు రూ 850 /- గా, మరియు ఆవు పాలు టోటల్ సాలిడ్స్ కి రూ 20 పెంచి రూ 310 గా నిర్ణయించి 01.04.2026 నుండి అమలుపరుచుటకు సర్వ సభ్య సమావేశం నిర్ణయము తీసుకుందని పత్రికా ముఖంగా తెలియజేసారు. ఈ పెంచిన పాలసేకరణ ధర మరియు బోనస్ తో కలిపి సమితి పాడి రైతులకు కేజీ ప్యాట్ కు రూ 935 /- ను కృష్ణా మిల్క్ యూనియన్ చెల్లించభోతుందని, ఇది దేశంలోనే పాడి రైతులకు చెల్లిస్తున్న అత్యధిక ధర అని ఈ సందర్భముగా తెలియజేసారు. 

ఈ సందర్భముగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గారు మాట్లాడుతూ సమితి పాడి రైతులకు 2025-26 ఆర్ధిక సంవత్సరమునకు గాను మూడవ విడత బోనస్ (డిసెంబర్ -25 నుండి మార్చి -26 వరకు) 10% క్రింద సుమారు 15 కోట్ల రూపాయలను పాడి రైతులకు ఏప్రియల్ మాసములో చెల్లిస్తామని ప్రకంటించారు.ఈ ఆర్ధిక సంవత్సరంలో మూడు విడతలగా సుమారు 45 కోట్ల రూపాయల బోనస్ ను పాడి రైతులకు అందించటం జరిగింది అని ఈ సందర్భముగా తెలియజేసారు.

ఈ సందర్భముగా గత 7 సంవత్సరములలో సమితి సాదించిన ప్రగతిని ఈ సందర్భముగా వివరించారు 

రూ. 716 కోట్లు వార్షిక టర్నోవర్ను రూ. 1265 కోట్లకు పెంచడం (77% వృద్ధి) జరిగింది.

రూ. 96 కోట్ల సమితి మిగులు నిధులను రూ. 250 కోట్లుకు పెంచడం చేయడం.

సమితి స్థిరాస్తులను రూ. 64 కోట్ల నుండి రూ. 320 కోట్లుకు పెంచడం జరిగింది.

సమితి వార్షిక స్థూల లాభం రూ. 75 కోట్లను రూ. 137 కోట్లకు పెంచడం జరిగింది

పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల సబ్సిడీ ఇవ్వడం హర్షణీయమని, ఈ సందర్భముగా కూటమి ప్రభుత్వమునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

పశువుల సంరక్షణతో పాటు గ్రామాలన్నీ ఆర్గానిక్ (సేంద్రియ) పద్ధతుల వైపు మళ్లేలా యూనియన్ ప్రోత్సహిస్తోందని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించే దిశగా 10 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వమునకు విన్నవించుటకు సర్వ సభ్య సమావేశము తీర్మానించిందని ఈ సందర్భముగా తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.10 లక్షల వ్యయంతో పశువుల వసతిశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పథకమును మంజూరు చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ఈ సందర్భముగా కృష్ణా మిల్క్ యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతు కుటుంబాల సంక్షేమం, పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో పాడి రైతుల ఆర్ధికాభివృద్దికి మరింత కృషి చేస్తుందని ఈ సందర్భముగా తెలిపారు. 

ఈ కార్యక్రమములో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కొల్లి ఈశ్వర బాబు గారు, సమితి పాలకవర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, సంఘ అధ్యక్షులు, సమితి అధికారులు మరియు సమితి సిబ్బంది పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Kerala
Kerala Strengthens Monsoon and Disaster Preparedness
Kerala continues to enhance disaster management and monsoon preparedness in 2026 by strengthening...
By Fathima Safa 2026-07-04 12:41:46 0 94
Andhra Pradesh
మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి...
By BABJI DADALA 2026-03-02 14:21:12 0 523
Haryana
Haryana Strengthens Law and Order Across the State
Haryana continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 05:19:26 0 75
Andhra Pradesh
Raghurama Krishnam Raju: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు: రఘురామకృష్ణరాజు.
ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో గాయపడిన రఘురామకృష్ణరాజు ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స...
By Pagadala Venkateswar 2026-03-01 10:59:10 0 225
Bharat Aawaz
🛡️ Even a Suspect Has Rights – Bombay High Court Upholds Constitutional Protection
In a landmark move that reinforces the spirit of the Indian Constitution, the Bombay High...
By Citizen Rights Council 2025-07-16 12:46:56 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com