Sreelalitha: విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు.

0
207

విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

 

విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గాయని శ్రీలలిత దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రమావిత’ అనే పాటను ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని మోదీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తిసామర్థ్యాలతో నిండిపోతుంది" అని పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా ఒక తెలుగు భక్తిగీతాన్ని ప్రశంసించడంతో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది.

 

ఈ పరిణామంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నగరానికి చెందిన ఓ మహిళ పాడిన పాటను ప్రధాని గుర్తించి, ప్రజలతో పంచుకోవడం విజయవాడ వాసులందరికీ గర్వకారణమని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభకు ప్రధాని నుంచి ప్రోత్సాహం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు.

Search
Categories
Read More
BMA
Corridors of Power: Restricting Parliament Press Passes
Indian journalists are experiencing a severe, unprecedented restriction in access to the...
By JoinBMA 2026-08-21 08:26:58 0 65
Andhra Pradesh
జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
*శ్రీ జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు*    నకిలీ మద్యం కేసులో అక్రమంగా...
By Rajini Kumari 2026-01-20 10:45:12 0 202
Telangana
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితులు అరెస్టు, మరో 9 మంది పరారీ
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి,...
By Bheeshman King 2026-01-16 13:16:34 0 743
Telangana
టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు ‎15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ...
By Ponnala Srinivasrao 2026-07-04 16:31:00 0 181
SURAKSHA
MP Police Digitize Case Workflows via e-Vivechana & nStep
The Madhya Pradesh Police are successfully modernizing law enforcement operations by...
By Lokeshwari Panthadi 2026-07-04 06:40:14 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com