ఎన్టీఆర్ జిల్లా ఇసుక అక్రమ రవాణా పై స్థానికులు అడ్డుకోవడంతో ట్రక్కును వదిలేసి పరారైన దుండగులు

0
230

*ఇసుక అక్రమ రవాణాపై గ్రామంలో ఉద్రిక్తత*

*స్థానికుల అడ్డుకోవడంతో ట్రాలీ వదిలి పరారైన దుండగులు*

 

Avja 

 

ఎన్టీఆర్ జిల్లా,వత్సవాయి మండలం పోలంపల్లి

గ్రామంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్నేరు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికుల సమాచారం మేరకు, ఇసుకతో నిండిన ట్రాక్టర్లు అధిక వేగంతో గ్రామం మధ్యగా ప్రయాణిస్తూ, ఓవర్‌లోడ్‌తో పాటు టేప్ రికార్డర్లను గట్టిగా మోగిస్తూ వెళ్తున్నాయని తెలిపారు. దీంతో రోడ్డు మీద ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

మున్నేరు నుంచి తీసుకెళ్తున్న ఇసుకను కొందరు అధికార పార్టీ అండతో తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇసుకతో నింపిన ట్రాలీని అక్కడే వదిలి అక్రమ రవాణాదారులు పరారయ్యారు.

గ్రామస్తులు మాట్లాడుతూ, “డబ్బుల కోసం రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు గ్రామంలో తిరుగుతున్నాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని భయంతో జీవిస్తున్నాం” అని తెలిపారు.

అదే విధంగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖాళీ ట్రక్కులు తీసుకువచ్చి, ఇక్కడ ఇసుక నింపి పంపుతున్నారని, ఒక్కో ట్రక్కుకు సుమారు మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజుకు పది పైగా ట్రక్కుల ద్వారా లక్షల రూపాయల అక్రమ ఆదాయం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్రమ రవాణాకు అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
శ్రీగణేష్ జోక్యంతో సద్దుమణిగిన అంబేద్కర్ విగ్రహ వివాదం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహంపై నెలకొన్న...
By Sidhu Maroju 2026-04-13 08:58:10 0 206
Telangana
యువతకు జైలు అనుభూతిని పరిచయం చేస్తున్న చంచల్‌గూడ జైలు
హైదరాబాద్: సమాజంలోని యువత, యువకులు, విద్యార్థులకు నేరాలు చేసినప్పుడు ఎదురయ్యే శిక్షలు మరియు జైలు...
By Akshay Goud 2026-06-12 13:08:39 0 311
Telangana
CSB బ్యాంక్ నూతనశాఖ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి లో CSB బ్యాంకు నూతన శాఖను బ్యాంకు...
By Sidhu Maroju 2026-01-05 07:25:38 0 245
Andhra Pradesh
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు అవసరం
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీఓ కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-07 04:49:10 0 237
Haryana
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25...
By BMA ADMIN 2025-05-22 07:20:14 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com