మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
246

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 

ప్రకృతితో ముడిపడి ఉన్న ఉగాది పర్వదినం, సబ్బండ వర్ణాల శ్రామిక, సాంస్కృతిక జీవనంలో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకున్నట్లే, ప్రజలందరి జీవితాల్లో కూడా కొత్త ఉత్సాహం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జీవితంలోని కష్టసుఖాలను ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె సమానంగా స్వీకరిస్తూ, వివేచనతో ముందుకు సాగినప్పుడే పరిపూర్ణమైన జీవితం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Uncategorized
Algae-Based Gastronomy Goes Mainstream
Foodies are shifting their focus this spring toward a surprising sustainable superfood: culinary...
By Dunna Jessicaruth 2026-05-19 06:40:43 0 121
Telangana
పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి  తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే...
By Sunka Santhosh 2026-06-10 18:17:30 0 128
Andhra Pradesh
Chandrababu Naidu: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం... పడగొట్టినవి నిలబెడదాం: సీఎం చంద్రబాబు.
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు సమీక్ష రాయలసీమ, ప్రకాశం జిల్లాల...
By Pagadala Venkateswar 2026-01-28 08:03:56 0 182
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 1K
Telangana
లక్సట్టిపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : లక్షెట్టిపేట్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు....
By Avunoori Mahesh 2026-06-22 11:57:01 0 301
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com