ఆపదలో ఆపద్బాంధవులు : బాధితురాలి కన్నీరు తుడిచిన అల్వాల్ క్రైమ్ టీం .|

0
188

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ, విధి నిర్వహణలో అల్వాల్ పోలీసులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 

ఆటోలో మర్చిపోయిన విలువైన వస్తువులను కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రికవరీ చేసి బాధితురాలికి అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

దివ్యచందన అనే మహిళ కొంపల్లి నుండి అల్వాల్‌లోని మచ్చబొల్లారం లో ఉన్న తన నివాసానికి ఆటోలో ప్రయాణించారు. 

ఇంటికి చేరుకున్న కొద్దిసేపటి తర్వాత, తన హ్యాండ్ బ్యాగ్ ఆటోలోనే ఉండిపోయినట్లు ఆమె గమనించారు. ఆ బ్యాగులో రూ. 21,000 నగదు, మొబైల్ ఫోన్ మరియు కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నాయి.

దీనిపై ఆమె ఈ రోజు (14-03-2026) ఉదయం 10 గంటలకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదుపై SHO మరియు DI ఆదేశాల మేరకు SI చంద్రశేఖర్ మరియు క్రైమ్ టీం తక్షణమే రంగంలోకి దిగారు. 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, త్వరితగతిన సదరు ఆటోను ట్రేస్ చేశారు.

ఫిర్యాదు అందిన నాలుగు గంటల లోపే ఆటోలో ఉన్న హ్యాండ్ బ్యాగ్, నగదు, మొబైల్ మరియు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అనంతరం స్టేషన్‌లో బాధితురాలు దివ్యచందనకు వాటిని భద్రంగా అప్పగించారు. 

పోగొట్టుకున్న వస్తువులను ఇంత త్వరగా తిరిగి ఇప్పించినందుకు బాధితురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులు ఎస్ఐ చంద్రశేఖర్ బృందానికి, అల్వాల్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

#sidhumaroji

Alwal

Search
Categories
Read More
Sikkim
Sikkim Celebrates 6th Gwala Diwas: Honoring Dairy Farmers
Sikkim recently marked a significant milestone by celebrating the 6th Gwala Diwas on July 1, a...
By Lokeshwari Panthadi 2026-07-02 08:28:08 0 103
SURAKSHA
The Sentinel of Order: The Journey of Virender Singh
Integrity in Uniform: A Legacy of Steadfast Service: Shri. Virender Singh, a distinguished...
By Kalaga Sailaja 2026-07-18 13:34:32 0 100
Andhra Pradesh
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో...
By Boiena Rajesh 2026-04-02 00:09:02 0 231
Telangana
జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు...
By Nookapangu Manikanta 2026-05-15 14:21:39 0 332
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన...
By Kothuru Murali 2026-05-21 18:18:32 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com