సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు

0
231

*శ్రీ సీతారామ కోవెలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు...*

  ***************************

పాత మంగళగిరి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం (సీతారామ కోవెల) లో ఈనెల 12వ తేదీ నుండి 14 వరకు జరుగుతున్న శ్రీ సీతారామస్వామి వారి ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త మహాకుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా శనివారం శ్రీరామచంద్రుని కళ్యాణోత్సవ మండపం, నిర్మాణం పూర్తి చేసుకున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాతఃకాల ఆరాధన, చతుద్వార పూజ, చతుర్థానార్చన, విశేష మంత్ర హోమాదులు, మహా పూర్ణాహుతి, సంప్రోక్షణ ప్రయుక్త మహా కుంభాభిషేకం, మహా నివేదన, వేద ఆశీర్వచన, ఆచార్య రుత్విక్ సన్మానం, తీర్థ ప్రసాద గోష్టి, శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది. దాతలు సూర్య దేవర సుధీర్, శ్రీమతి సుధశ్రీ దంపతులు పూజలలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వీఆర్ శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ అర్చక స్వామి నంబూరి సీతారామానుజాచార్యులు, అర్చక బృందం కళ్యాణం, పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ పర్యవేక్షించారు. 

*- బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.*

Search
Categories
Read More
Andhra Pradesh
రెండు రోజులుగా కరెంట్ కష్టాలు
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట, ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీ, జగనన్న కాలనీకు రెండు రోజులుగా...
By Boiena Rajesh 2026-04-14 13:45:41 0 201
Andhra Pradesh
నారాయణ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల ఆందోళన
పుంగనూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలిపారు. నారాయణ...
By Kothuru Murali 2026-06-20 16:18:11 0 112
Andhra Pradesh
Chandrababu Naidu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 1) నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు...
By Pagadala Venkateswar 2026-03-31 10:47:35 0 212
SURAKSHA
Zendage Hanumant Kondiba IAS: A Visionary Administrator
A dedicated Telangana IAS officer known for transparent governance, citizen-centric...
By Lokeshwari Panthadi 2026-07-15 06:40:50 0 250
Andhra Pradesh
మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర...
By Pagadala Venkateswar 2026-02-16 11:01:53 0 382
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com