చీరాలలో స్టాక్ మార్కెట్ పేరిట భారీ మోసం

0
837

స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భారీగా నగదు కోల్పోయిన ఘటన చీరాలలో వెలుగుచూసింది. ఈ విషయమై చీరాల I టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వివరాలను వెల్లడించారు. చెన్నైలోని బ్యాంకింగ్ రంగానికి చెందిన ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనుమకొండ గోపి అనే వ్యక్తి ఈ మోసానికి గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన స్టాక్ మార్కెట్ అడ్వైజరీ ప్రకటనలకు ఆకర్షితుడైన గోపి, అనంతరం వారి వాట్సాప్ గ్రూపులో చేరారు.

నేరగాళ్లు 'క్యాప్‌స్టోన్' అనే మొబైల్ యాప్‌ ద్వారా తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయని అతడిని నమ్మించారు. తొలుత కొన్ని ఐపీఓల లో పెట్టుబడి పెట్టించి, లాభాలు వస్తున్నట్లు నకిలీ గణాంకాలను చూపించారు. దీంతో వారిని పూర్తిగా నమ్మిన గోపి, తన క్రెడిట్ కార్డులు మరియు వివిధ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సుమారు రూ.24,16,000 వరకు పెట్టుబడి పెట్టారు. అయితే, తన నగదును విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, మరిన్ని ఛార్జీల పేరిట నేరగాళ్లు ఇంకా నగదు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సీఐ ప్రజలకు పలు సూచనలు చేశారు. అపరిచిత లింకులు సోషల్ మీడియాలో వచ్చే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, పార్ట్-టైమ్ జాబ్ ఆఫర్ల లింకులను క్లిక్ చేయవద్దని సీఐ సుబ్బారావు తెలిపారు.డిజిటల్ అరెస్ట్ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి సిబిఐ, ఎసిబి లేదా ముంబై పోలీసులమని చెప్పి 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నామని బెదిరిస్తే భయపడవద్దని అలా వచ్చిన వెంటనే సమాచారం అందించాలని సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించి, వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ సంస్థలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కు చెదరని స్థానం
*ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కుచెదరని స్థానం*   *జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-26 09:41:50 0 267
Andhra Pradesh
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్.
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం ఇది తెలుగు హాస్యానికి,...
By Pagadala Venkateswar 2026-01-26 11:20:19 0 214
Telangana
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి
హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు   కాంగ్రెస్ ప్రభుత్వం...
By Sadaq Sadaq 2026-08-17 09:16:35 0 107
Andhra Pradesh
మనం అడ్రస్ లేనివాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి: మంత్రి లోకేశ్‌.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించుకుందామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల...
By Pagadala Venkateswar 2026-08-15 09:53:43 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com