భార్యపై భర్త కిరాతకం: న్యాయం కోసం బాధితురాలి ఆవేదన.
Posted 2026-02-03 06:10:23
0
165
మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య విజయను ఆదివారం రాత్రి కిరాతకంగా కొట్టారు. తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమ కులాంతర వివాహం చేసుకున్నామని, ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చకపోవడంతో మొదటి నుంచి తనపై శారీరక, మానసిక వేధింపులు కొనసాగుతున్నాయని బాధితురాలు విజయ వాపోయారు. ఇటీవల భర్త సుధాకర్ రెడ్డి తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడని, అయినప్పటికీ తనకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి భర్తపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Wednesday Hero UP Police: Blood Donors Saving Lives
This Wednesday UP police officers led blood donation camps in 15 districts. “Rakt Daan...
Breaking News from Iran
ఇరాన్ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
దౌర్జన్య ఘటనలపై చర్యలు తీసుకోవాలి : మదనపల్లి ఎమ్మెల్యే
ఆదివారం నాడు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి...
కొత్తపేట లో ప్రమాదాలకు నిలయంగా వంగిన విద్యుత్ స్తంభం, భయాందోళనలో కాలనీవాసులు
కిర్లంపూడి, కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలో కొత్తపేటకు చెందిన ఇండ్ల సముదాయం మధ్యలో...
C M Revanth reddy
ఫిన్లాండ్, జర్మనీల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో...