ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు

0
210

ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు' 

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

గొల్లపూడిలో 50 అర్జీలు సమర్పణ.

 

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 13.03.2026.

 

ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు 'ప్రజాదర్బారు' కార్యక్రమ నిర్వహణ దర్పణం పడుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బారు) నిర్వహించారు. మొత్తం 50 మంది ఆర్జీలు సమర్పించారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

 

ఇళ్లు, ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి, పెన్ష‌న్లు, దివ్యంగుల సర్టిఫికెట్లు మంజూరు, వివిధ రెవెన్యూ సేవ‌లు, పోలీసు సేవలకు సంబంధించి అర్జీలు వ‌చ్చాయి.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం (పి.జి.ఆర్.ఎస్) ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

 

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.

 

రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు, మంత్రి నారా లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. 

 

ప్రజదర్బార్‌ వేదికలో అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడ వచ్చే సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్లలో రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ప్రారంభోత్సవం బాధితుల చిరునామా రెడ్ క్రాస్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
    బాపట్ల జిల్లా: బాధిత జనావళికి అండగా, వారికి బాసటగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద...
By Gadiyapudi Narendra 2026-02-17 16:16:55 0 238
Andhra Pradesh
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ...
By Rajini Kumari 2025-12-16 11:15:56 0 293
Andhra Pradesh
మదనపల్లెలో మురికి కాలువలు, రోడ్ల శుభ్రత: ఎమ్మెల్యే ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్...
By Pagadala Venkateswar 2026-04-03 06:00:42 0 242
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: భక్తుల రాకకు భారీ ఏర్పాట్లు
ఏప్రిల్ 7, 8 తేదీల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా...
By Kothuru Murali 2026-03-28 06:05:06 0 202
Telangana
అమరవీరుల శిబిరంలో ఉద్యమకారుల దీక్షలు.|
• జేఏసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు • మూడో రోజు...
By Sidhu Maroju 2026-09-19 07:58:45 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com