రేపు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,* బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన

0
98

క్రైమ్ కౌంటర్ న్యూస్....

మార్కాపురం జిల్లా...

 

*రేపు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,*

 

బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ,

 

*బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తతో ఉండాలి: జిల్లా ఎస్పీ*

 

రేపు ఈ నెల 27 న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో శనివారం గిద్దలూరులో జిల్లా ఎస్పీ బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులతో బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. 

 

జిల్లా ఎస్పీ , మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వారికి కేటాయించిన స్థలాలకు నిర్దేశించిన సమయానికి విధులకు హాజరు కావాలని సూచించారు. హెలిప్యాడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సభ వేదిక, వీఐపీ రూట్ బందోబస్తు, గ్యాలరీలు, మఖ్యంగా పార్కింగ్ ప్రదేశాలలో భద్రతాపరమైన అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అవసరమైన చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సిబ్బంది తమకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బయట నుండి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాలలోనే పార్కింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సభ ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎవరైనా తమ విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

 

ముఖ్యమంత్రి , పర్యటనకు వచ్చే ప్రజలు తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని, అలాగే వెళ్లేటప్పుడు కూడా క్రమపద్ధతిలో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా పోలీసు శాఖ సూచించిన నిబంధనలు మరియు సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

 

ముఖ్యమంత్రి ,

 మార్కాపురం జిల్లా పర్యటనకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ , తెలిపారు. ఈ బందోబస్తు నిమిత్తం 2 ఏఎస్పీలు, 7 మంది డిఎస్పీలు, 32 సీఐలు, 84 మంది ఎస్ఐలతో పాటు 829 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది ఏఆర్ సిబ్బంది, APSP సిబ్బందిని కేటాయించామని జిల్లా ఎస్పీ తెలిపారు.

 

*ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ*

 

 జిల్లా ఎస్పీ , భద్రతా ఏర్పాట్లను పరిశీలించి హెలిప్యాడ్‌ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సభా వేదిక, కార్యకర్తల మీటింగ్ జరిగే ప్రాంతం వరకు నిర్వహించిన సి.యం , కాన్వాయ్ ట్రయిల్‌ రన్‌ను పర్యవేక్షించి అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియ చేశారు. 

 

ముఖ్యమంత్రి , కాన్వాయ్ వచ్చేటప్పుడు బందోబస్త్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్పెషల్ పార్టీ, పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాన్వాయ్ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి , కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా బందోబస్త్ విధులు నిర్వహిస్తూ సీఎం పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ , అధికారులను ఆదేశించారు.

 

జిల్లా ఎస్పీ , వెంట ఎస్ఎస్ జి అడిషనల్ ఎస్పీ సిహెచ్ మల్లికార్జున, అడిషనల్ ఎస్పీ సిహెచ్ జీవి ప్రసాద్, ఏపీఎస్పీ ఏడవ బెటాలియన్ కమాండెంట్ ఏ మురళి, డీఎస్పీలు, సిఐలు మరియు ఎస్ఐలు ఉన్నారు....

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ బాంబే కాలనీలో ఎంపీ లార్డ్స్ నిధులు 75 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన
*ప్రచురణార్థం* ది:19-04-2026   *వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 75 లక్షలతో కమ్యూనిటీ...
By Rajini Kumari 2026-04-19 12:29:33 0 157
SURAKSHA
The Intelligence Veteran: Delhi’s New Police Chief
Precision and Policy: A New Chapter for Delhi Police: "A force is only as effective as its...
By Kalaga Sailaja 2026-07-18 12:32:12 0 99
Andhra Pradesh
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ ప్రయాగ్రాజ్
శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ (ప్రయాగ్‌రాజ్) ఇంద్రకీలాద్రి సందర్శించారు  ...
By Rajini Kumari 2026-01-01 10:37:18 0 287
Technology
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...
By Dunna Jessicaruth 2026-05-18 12:10:58 0 109
Andhra Pradesh
మార్క్ టల్లి మరణం మీడియా లోకానికి తీరని లోటు
ప్రముఖ రచయిత జర్నలిస్టు మార్క్ టిల్లీ l భారతీయ అసలు సిసలు వ్యాఖ్యాత మార్క్ ఢిల్లీ కన్నుమూశారు...
By Benguluri Madhubabu 2026-01-26 07:08:17 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com