TTD: టీటీడీ కీలక నిర్ణయం.. బాసర తరహాలో తిరుపతిలో అక్షరాభ్యాసం సౌకర్యం.

0
247

వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం

'అక్షర గోవిందం' పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం

బాసర ఆలయం తరహాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం

అక్షరాభ్యాసం తర్వాత ఏడు వస్తువులతో ప్రత్యేక కిట్ పంపిణీ

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త అందించింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర జ్ఞానసరస్వతీ ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు అవకాశం కల్పించింది. 'అక్షర గోవిందం' పేరుతో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఇకపై తమ పిల్లలకు ఏడుకొండలవాడి తల్లి వకుళమాత ఆశీస్సులతో అక్షర శ్రీకారం చుట్టించాలని భావించే భక్తుల కోరిక నెరవేరనుంది.

 

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన విజ్ఞప్తి మేరకు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) ఈ 'అక్షర గోవిందం' ప్రాజెక్టును రూపొందించింది. మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. అయితే, వకుళమాత ప్రధాన ఆలయం ఒక చిన్న కొండపై ఉండటంతో భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

 

ఈ నూతన మండపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడే చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత, పిల్లలకు 'అక్షర గోవిందం' పేరుతో ఏడు రకాల వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్‌ను అందజేస్తారు. ఇందులో పలక, బలపాల పెట్టె, శ్రీవారి అక్షతలు, అమ్మవారి కుంకుమ, వినాయకుడు-సరస్వతి-శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటం, కంకణాలు, పటికబెల్లం ప్రసాదం ఉంటాయి.

 

తొలుత ఈ కార్యక్రమాన్ని 300 కిట్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ కిట్లను ఉచితంగా అందించాలా? లేక నామమాత్రపు రుసుము వసూలు చేయాలా? అనే విషయంపై టీటీడీ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. హెచ్‌డీపీపీ లేదా ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Shaik Darvesh Saheb IPS: Leading Kerala Police with Integrity, Vision and Commitment
"The true strength of policing lies not only in enforcing the law but also in earning the trust...
By Fathima Safa 2026-07-08 07:24:49 0 211
Andhra Pradesh
పోలీసునని నమ్మించి కారు కజేసిన యువకుడు
BHARAT AAWAZ న్యూస్  పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు  కళ్యాణదుర్గం, తాను...
By Chennaiah Kati 2026-06-10 06:58:51 0 132
SURAKSHA
Utkal Ranjan Sahoo: Leading Rajasthan Police with Vision
The Journey Begins "The strength of a police force lies not only in enforcing the law but in...
By Fathima Safa 2026-07-21 07:30:10 0 95
Andhra Pradesh
మదనపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం 50 మందిపై కేసులు.
మదనపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలపై 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ...
By Pagadala Venkateswar 2026-02-19 06:26:06 0 232
Telangana
దూరం దూరమైంది... రేషన్ చేరువైంది.|
● రాజీవ్ గాంధీ నగర్‌లో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ●...
By Sidhu Maroju 2026-08-01 10:06:49 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com