రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

0
553

31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి  మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి రూ.8,53,78,180 అందివ్వడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్దిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నవని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేయబడతాయని తెలిపారు. కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, గుడి అభివృద్ధికి ముందుకు వచ్చిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు.  కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతున్నదని, రామాయపట్నం పోర్టు పూర్తవుతుందని, బిపిసిఎల్ కు ప్రధాని నరేంద్ర మోడీ  శంకుస్థాపన చేయనున్నారని, దగదర్తి ఎయిర్ పోర్టు కు ఏప్రిల్ లో భూమి పూజ జరగనుందని తెలిపారు. మై టీడీపీ యాప్ చక్కగా వినియోగించిన కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్వాంటం టాక్ బై CM
• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం •...
By Rajini Kumari 2025-12-23 09:45:45 0 217
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ
పుంగనూరు పట్టణంలో న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ...
By Kothuru Murali 2026-02-14 07:51:48 0 195
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కేతనపల్లెలో మామిడి తోటలో చెలరేగిన మంటలు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం కేతనపల్లె గ్రామ సమీపంలో మామిడి తోటలో ఆదివారం మధ్యాహ్నం...
By Kothuru Murali 2026-02-23 12:00:01 0 182
SURAKSHA
​. 'CEN' Wings for Tackling Cyber Crime
To combat growing digital threats, Karnataka Police established dedicated 'CEN' (Cyber, Economic,...
By Kalaga Sailaja 2026-06-29 11:47:22 0 279
Telangana
బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై కేసు నమోదు చేయాలి
 నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు...
By Nookapangu Manikanta 2026-04-29 10:54:55 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com