సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు

0
1K

మార్కాపురం:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు ప్రదానం చేశారు.

గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోట్టి ముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సామాజిక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను సన్మానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, థలసేమియా పిల్లలకు రక్తం అందించడం, వృద్ధాశ్రమాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, పేదలకు ఆహారం అందించడం వంటి సేవలను గుర్తించి సూర్యోదయ సంస్థకు ఈ అవార్డును అందజేశారు.

ఈ అవార్డును గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నకేశవులు, ప్రముఖులు పి.వి.సి. అంజనీ కుమారి (హైకోర్టు సూపరింటెండెంట్, హైదరాబాద్), జి. గోవింద్ (టీచర్, రైటర్, యాక్టర్), జి. చెన్నకేశవులు (ఇన్ఫోటెక్ సీఈవో, బెంగళూరు), రాధా (స్టేట్ మెంబర్, వాసవి క్లబ్), మాజీ గవర్నర్ కిరణ్ కుమార్ గంగిశెట్టి, ఎం. నాగిరెడ్డి చేతుల మీదుగా డి. గోవిందరెడ్డి స్వీకరించారు.

ఈ సందర్భంగా సూర్యోదయ సంస్థ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో అవసరమైన వారికి సహాయం అందించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్...
By Mittapelli Saketh 2026-03-28 10:51:43 0 685
Andhra Pradesh
పుంగనూరు:సుగుటూరు గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 09:52:50 0 185
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 13:05:43 0 174
Andhra Pradesh
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్...
By Pagadala Venkateswar 2026-06-13 10:45:47 0 111
SURAKSHA
P. S. Pradyumna IAS: Transforming Governance with Vision
A dynamic Andhra Pradesh cadre IAS officer recognized for administrative excellence, urban...
By Lokeshwari Panthadi 2026-07-16 06:17:36 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com