మిస్సింగ్ కేసుల చేదనకు నివారణ కు వేగవంతమైన చర్యలు

0
233

*ప్రకాశం జిల్లా తేదీ:09.03.2026*

 

*మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతమైన చర్యలు చేపట్టాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,గారు*

 

*రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ గారు.*

 

మిస్సింగ్ కేసులు, NBWలు, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీసి, తగిన సూచనలు, సలహాలు తెలియజేసారు.

 

మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఏవరైన తప్పిపోయారని లేదా కనిపించుటలేదని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి ట్రేస్ చేయుటకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని, మిస్సింగ్‌ కేసులను మతిస్థిమితం లేని వ్యక్తులు, చిన్నారులు, వృద్ధులు, బాలికలు, యువతులు, మహిళలు, పురుషులు కేటగిరులుగా విభజించి అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనడంలో అధునాతన విధానాలు అనుసరించాలని, మిస్సింగ్ కేసులలో ఎంత వేగంగా విచారణ మొదలుపెడితే అంత తొందరగా ట్రేస్ చెయ్యగలమని, కావున మిస్సింగ్ కేసుల్లో అలసత్వం వహించవద్దని జిల్లా ఎస్పీ గారు అన్నారు. 

 

అదేవిధంగా నాన్‌బెయిలబుల్ వారెంట్లు (NBW) ఎటువంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన అమలు చేయాలని, ముఖ్యంగా చెడు నడత కలిగిన నేరస్తులపై జారీ అయిన NBWలను ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా ఎగ్జిక్యూట్ చేయాలని, సమన్స్‌లను సంబంధిత వ్యక్తులకు సకాలంలో సర్వ్ చేయాలని అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. మహిళకు సంబంధించిన కేసులలో త్వరగా స్పందించాలన్నారు.

 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,అదే విధంగా యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీసు వారితో మరియు ఇతర సంబంధిత శాఖ అధికారులు యాక్సిడెంట్ ప్రదేశమును సందర్శించి IRAD యాప్ ద్వారా పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

 

అదే విధంగా వాటికి సంబంధించిన డేటాను కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో సక్రమంగా పొందుపరచి, కేసుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో తాజా సమాచారం సమయానికి అప్‌డేట్ పొందుపరచాలన్నారు.

 

ఈ సమావేశంలో డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని...
By Sidhu Maroju 2026-03-29 07:00:14 0 176
Telangana
మద్యం దుకాణాల సంఖ్య పెరిగిపోతుండడంపై హైకోర్టు ఆందోళన.|
హైదరాబాద్ – నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం...
By Sidhu Maroju 2025-11-26 07:34:43 0 217
Andhra Pradesh
Madanapalle: మై టీడీపీ యాప్‌లో చురుగ్గా పాల్గొన్నందుకు మదనపల్లెకు చెందిన సులోచనకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న సులోచన.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు ఇంచార్జ్, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి సతీమణి...
By Pagadala Venkateswar 2026-08-31 13:07:28 0 78
BMA
Understanding Journalist Rights
Knowing your legal rights is essential for any working journalist. This comprehensive guide...
By JoinBMA 2026-08-19 04:18:37 0 98
Andhra Pradesh
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.
ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత కమిటీ విచారణ...
By Pagadala Venkateswar 2026-02-23 10:13:00 0 348
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com