AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు.

0
183

 

AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు

10-03-2026 Tue 08:06 | Andhra

 

AP Teachers Get Double Good News Cases Withdrawal Attendance Exemption

సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం

2022లో సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన తెలిపిన 73 మంది ఉపాధ్యాయులకు ఊరట

అంధ ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు నుంచి మినహాయింపు

ప్రధానోపాధ్యాయులు లీప్ యాప్‌లో వీరి హాజరు నమోదు చేయాలని ఆదేశం

ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. గత ప్రభుత్వ హయాంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, అంధ ఉపాధ్యాయులకు హాజరు నిబంధనల్లో కీలక మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ, పాఠశాల విద్యాశాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

 

వివరాల్లోకి వెళితే.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో 2022 ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సమావేశమైన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదన్న కారణంతో విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో మొత్తం 73 మంది ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. కోర్టులో కేసు ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండేళ్లుగా ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించినట్లయింది.

 

అంధ ఉపాధ్యాయుల‌కు ప్రభుత్వం మరో ఊరట

ఇదే సమయంలో అంధ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం మరో ఊరట కల్పించింది. పాఠశాలల్లో అమలు చేస్తున్న ముఖ ఆధారిత హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానం నుంచి వారికి మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని దృష్టిలోపం గల ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును "లీప్" (LEAP) యాప్‌లో నేరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ రెండు నిర్ణయాలు ఉపాధ్యాయుల పట్ల కొత్త ప్రభుత్వ సానుకూల వైఖరిని సూచిస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీలో శుక్రవారం ఒంటరి ఏనుగు దాడులు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీలో శుక్రవారం ఒంటరి ఏనుగు దాడులు నిర్వహించి...
By Kothuru Murali 2026-01-10 10:13:53 0 212
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జూన్ 2న సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు
🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-05-23 07:23:29 0 646
Andhra Pradesh
చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.
చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్...
By Shyamala Yadagiri 2026-06-05 17:20:02 0 259
Andhra Pradesh
మదనపల్లె టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా భారతి నాయుడు నియామకం.
మదనపల్లెలో తెలుగుదేశం పార్టీలో 15 ఏళ్ల తర్వాత ఒక మహిళకు కీలక బాధ్యత దక్కింది. గురువారం బైగారి...
By Pagadala Venkateswar 2026-06-19 04:31:26 0 113
Andhra Pradesh
బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-03-07 09:26:12 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com