రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
Posted 2026-03-08 17:46:06
0
1K
కాకినాడ జిల్లా కరప పీహెచ్‌సీలో కంటింజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని సంవత్సరాలుగా జీతాలు చెల్లించకపోవడం పట్ల మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు ఆమెకు రావాల్సిన జీతాలు బకాయిగా ఉన్నాయని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళల సాధికారతపై వేడుకలు జరుగుతున్న సమయంలో, మరోవైపు దుర్గ మాత్రం తన జీత బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని మహిళా సంఘాలు తెలిపారు.
దుర్గకు సుమారు రూ.10 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) కూడా అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బకాయి జీతాలను చెల్లించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"జగన్నాథుడికి జ్వరం ఎందుకు?"
"రథయాత్రకు ముందు జరిగే అనసార విధానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం"
హైదరాబాద్ జులై 5 : ప్రపంచ...
బాచుపల్లి అగ్ని ప్రమాదం
Quthbullapur Fire Accident: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ...
Vision in Governance: The Inspiring Journey of IAS Nishant Kumar Yadav
Excellence in Public Administration: How IAS Nishant Kumar Yadav is Redefining Governance :...
52 వ వార్డు వుడా కాలనీ పార్కులో ‘ఎమ్మెల్యే కప్’ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం- రాకెట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ప్రభుత్వ విప్ గణబాబు
శ్రీ వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా వుడా లేఅవుట్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్...
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears
In a democracy, media is not just a messenger —...