రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం

0
191

*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*

 

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

 

` ఐదుగురు లబ్ధిదారులకు రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలు అందజేత

 

 విజయవాడ : రాష్ట్రంను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని జయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఎపిని అభివృద్ది పథం వైపు నడిపించటంతోపాటు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ శివనాథ్ వివరించారు.

 

గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలను ఎంపి కేశినేని శివనాథ్ ఐదుగురు లబ్ధిదారులకు రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు సుకాసి శ్రీనివాస్‌లతో కలసి అందజేశారు.

 

 తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన బండి శ్రీలక్ష్మీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6 లక్షల రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని ఆమె కుటుంబసభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.

 

అదే విధంగా రోడ్డు ప్రమాదంకు గురై తీవ్ర గాయాల పాలైన తిరువూరు నియోజకవర్గం ఎ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన భూక్యా లోకేష్‌కు రూ.1,77,044, అదే గ్రామానికి చెందిన భూక్యా ఉపేంద్ర కు రూ.2,13,916 చొప్పున వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్.వో.సి పత్రాలను ఎంపీ శివనాథ్ అందజేశారు.

 

అదే రీతిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మల్లిఖార్జునపేటకు చెందిన కలవకొల్లు దుర్గాభవానీ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ1,60,225 విలువైన ఎల్.వో.సి పత్రాన్ని ఎంపీ శివనాథ్ ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. విజయవాడకు చెందిన మేకా శేషగిరిరావు హెర్నీయా సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.72,925 విలువైన ఎల్ఓసి పత్రాన్ని శేషగిరిరావుకు ఎంపీ అందజేశారు. తమకి సీఎంఆర్ఎఫ్ కింద ఎల్.వో.సిలు మంజూరు అయ్యే విధంగా సాయం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి లబ్ధిదారులు, లబ్ధిదారుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో ఎ.కొండూరు మండలం టిడిపి అధ్యక్షులు పీక్లా నాయక్, విజయవాడ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ మైలపల్లి రాజు, ఐటిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు చైతన్యలతో పాటు తిరువూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
By Pinnehasan Odela 2026-02-04 07:42:46 0 321
Telangana
ఆసిఫాబాద్‌లో వర్షాకాలం ముందస్తు చర్యలు ముమ్మరం: డ్రైనేజీల క్లీనింగ్
🎤కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ : ఆసిఫాబాద్: త్వరలో వర్షాకాలం...
By Chunarkar Jagadeesh 2026-05-31 03:56:07 0 711
International
War effect in india
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు ముఖ్యంగా భారతదేశంపై పడే ప్రభావాలు చాలా...
By G k Nookala 2026-03-01 08:01:18 0 175
Telangana
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్ ఇచ్చింది కానీ, ఇప్పుడు...
By Ponnala Srinivasrao 2026-04-28 04:38:41 0 157
Andhra Pradesh
వాహనాల కొనుగోలులో అక్రమ వసూలు నివారణకు చర్యలు తీసుకోండి.
అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్‌లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు...
By Pagadala Venkateswar 2026-02-14 05:57:27 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com