అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...

0
755

పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థులు గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభను సందర్శించారు. శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు సభ నిర్వహణ, చట్టసభ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారు విద్యార్థులతో మాట్లాడి శాసనసభ ప్రాధాన్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల పాత్ర గురించి వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు. శాసనసభ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రత్యక్షంగా చూసే అవకాశం విద్యార్థులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. చట్టసభలు ఎలా పనిచేస్తాయి, ప్రజా సమస్యలపై ఎలా చర్చలు జరుగుతాయి అన్న విషయాలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకు విస్తృతమైన అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.
శాసనసభ సందర్శనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఫోటోలు దిగారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గృహ ప్రవేశలు & పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా జూన్ 1: ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కొఠారి గ్రామపంచాయతీలోని...
By Avunoori Mahesh 2026-06-01 22:59:41 0 166
Telangana
"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర...
By Sidhu Maroju 2026-05-12 09:13:09 0 611
Telangana
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి
  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.... 141 వ మేడే ను...
By Gujile Ramu 2026-04-25 14:05:55 0 198
SURAKSHA
TN Police Vigilant Against Illegal Liquor Smuggling
Yesterday, the Tamil Nadu Police intensified vehicle inspections at state borders. They...
By Kalaga Sailaja 2026-06-27 11:41:07 0 162
Andhra Pradesh
సదుము మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ.
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి,...
By Pagadala Venkateswar 2026-02-08 11:03:17 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com