TTD: మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

0
176

ఈ నెల 19న ఉగాది పర్వదినం

ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం

17న బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో త్వరలో జరగబోయే 'ఉగాది ఆస్థానం' వేడుకలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 19న తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ప్రత్యేక పర్వదినం కోసం ఆలయాన్ని శుద్ధి చేసేందుకు మార్చి 17న (మంగళవారం) 'కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పండుగలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం టీటీడీలో అనాదిగా వస్తున్న ఆచారం.

 

 

 

ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. దీని కారణంగా మార్చి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఉగాది పర్వదినం సందర్భంగా కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కావున మార్చి 18న సిఫార్సు లేఖలు సమర్పించే అవకాశం ఉండదు.

Search
Categories
Read More
Telangana
కాషాయ ముసుగులో కన్నింగ్ దొంగలు - వృద్ధులే లక్ష్యంగా చోరీలు .|
సికింద్రాబాద్.. ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి...
By Sidhu Maroju 2026-02-11 15:21:07 0 259
Andhra Pradesh
పుంగనూరు: రాష్ట్ర యువజన కోకన్వీనర్ గా ప్రేమ్ కుమార్
బీసీవై పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌గా పుంగనూరుకు చెందిన న్యాయవాది ప్రేమ్...
By Kothuru Murali 2026-02-01 13:53:27 0 234
Andhra Pradesh
రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం.
రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన...
By Pagadala Venkateswar 2026-07-09 04:54:34 0 105
Andhra Pradesh
ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: JC ఆదేశాలు.
మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్...
By Pagadala Venkateswar 2026-02-19 06:45:45 0 239
Andhra Pradesh
జాతీయ పశు ఆరోగ్య శిబిరం రైతులందరూ సద్వినియోగం చేయాలి.
ఈనెల 19 నుంచి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-20 06:20:45 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com