Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు.

0
188

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్

గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై ప్రధానంగా చర్చ

జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది. మంగళగిరిలో 'ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం' సందర్భంగా జరిగిన అటవీ శాఖ 'హనుమాన్' ప్రాజెక్టు ప్రారంభోత్సవం ముగించుకుని పవన్ నేరుగా సీఎం వద్దకు వెళ్లారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై చర్చ జరిగింది. 

 

 

 

 

రాష్ట్రంలో 'జల్ జీవన్ మిషన్' అమలుపై ముఖ్యమంత్రితో పవన్ చర్చించారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు తలసరి 55 లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని వీరు నిర్ణయించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్ళించిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ మిషన్ గడువును 2028 వరకు పొడిగించిన నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కేవలం నీటి సరఫరానే కాకుండా గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, నిర్వహణపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించారు.

 

 

 

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, వైరల్ అవుతున్న వీడియోల అంశం కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. టీటీడీ పవిత్రతను కాపాడటంతో పాటు, వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ కోణాలను వీరు విశ్లేషించినట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ ప్రసాదాల్లో నాణ్యత, భక్తుల సౌకర్యాలపై కూడా సమీక్షించారు.

 

 

 

 

త్వరలో భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా ఇరువురు నేతలు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్య, శాంసన్ కాదు.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కొంపముంచేది ఇతనే..! ముందే ఓటమిని శాసించిన విలన్
Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా...
By SivaNagendra Annapareddy 2026-01-20 08:20:42 0 662
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 3K
Andhra Pradesh
ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా...
By Pagadala Venkateswar 2026-09-17 05:23:54 0 55
Telangana
కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..! రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక
కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..!*  ‎తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా...
By Ponnala Srinivasrao 2026-05-13 23:28:42 0 133
Telangana
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత పోలీస్ అవగాహన కార్యక్రమం ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు జముల్దారాలో కళాబృందం ప్రదర్శనలు
🎤భారత్ ఆవాజ్ న్యూస్ (కుమ్రం భీం  ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా...
By Chunarkar Jagadeesh 2026-09-16 13:18:55 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com