Chandrababu Naidu: ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.

0
218

సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు

చెడుపై మంచి గెలుపునకు సూచిక ఈ పండుగ అన్న సీఎం చంద్రబాబు

సమత, మమతలకు హోలీ ప్రతీక అని పేర్కొన్న లోకేశ్

హోలీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను పురస్కరించుకుని ఈరోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు. 

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ‘హోలీ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని తన పోస్టులో పేర్కొన్నారు. 

 

మంత్రి నారా లోకేశ్ తన సందేశంలో.. ‘వ‌సంత రుతువుకు స్వాగ‌తం ప‌లికే రంగుల సంబ‌రం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. స‌మ‌త‌, మ‌మ‌త‌ల‌కు చిహ్నంగా, పేదా, పెద్ద తార‌త‌మ్యాలు లేకుండా, కుల‌మ‌త భేదాలు చూడ‌కుండా రంగుల్లో అంతా క‌లిసిపోయి ఆనందాల‌ను పంచుకునే హోలీ పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్షలు’ అని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:20:31 0 166
Rajasthan
Churu Court Delivers Verdict in Shocking 2022 Murder Case Involving Woman, Occultist
Churu (Rajasthan): In a chilling case that shook Rajasthan’s Churu district, the District...
By BMA ADMIN 2025-05-20 06:47:45 0 2K
Andhra Pradesh
మదనపల్లి: తుమ్మచెట్లపల్లి దాడి ఘటన కొత్త మలుపు.
మదనపల్లి నియోజకవర్గం తుమ్మచెట్లపల్లిలో రైతు సురేంద్రపై బుధవారం రాత్రి జరిగిన దాడి ఘటన కొత్త మలుపు...
By Pagadala Venkateswar 2026-02-06 13:09:33 0 189
Andhra Pradesh
రామసముద్రంలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.
సోమవారం రామసముద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన...
By Pagadala Venkateswar 2026-06-30 07:14:51 0 123
Andhra Pradesh
పుంగనూరు: మసెమ్మకు ప్రత్యేక పూజలు చేసిన పెద్దిరెడ్డి
పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో మసెమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ...
By Kothuru Murali 2026-02-01 09:55:20 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com