వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..

0
280

బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అతివేగంగా వెళ్లి రోడ్డుపై నడుస్తున్న మహిళను మరియు ఆమె వెంట ఉన్న గేదెలను ఢీకొట్టింది.
స్థానికుల సమాచారం మేరకు ప్రమాదానికి ప్రధాన కారణం వాహనం అతివేగమేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామం స్థావరం పాలెంకు చెందిన కొమ్మనబోయిన సుబ్బయ్యమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమె తనకు చెందిన గేదెలను పొలంలో మేపుకుని ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం ఏడు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా దుఃఖంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో...
By Pagadala Venkateswar 2026-03-17 08:11:57 0 220
Andhra Pradesh
పుంగనూరులో ముందస్తుగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి...
By Kothuru Murali 2026-04-14 04:04:42 0 233
SURAKSHA
Suraksha Vahini by WB Police Ensures Women Safety in Public PlacesSuraksha Vahini by WB Police Ensures Women Safety in Public PlacesSuraksha Vahini by WB Police Ensures Women Safety in Public Places
West Bengal Police Suraksha Vahini patrols buses, colleges, markets and railway stations for...
By Kalaga Sailaja 2026-07-01 13:13:34 0 248
SURAKSHA
Shaleen Kabra, IAS: Driving Visionary Governance in J&K
An Accomplished IAS Officer Leading Infrastructure, Urban Development, and Administrative...
By Lokeshwari Panthadi 2026-07-17 08:38:02 0 77
SURAKSHA
Abhinav Kumar, IPS: Leading Uttarakhand with Integrity
A distinguished 1996-batch IPS officer whose commitment to professional policing, administrative...
By Lokeshwari Panthadi 2026-07-29 10:28:52 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com