అడవి తల్లి దీవెన.... గుంజేడు ముసలమ్మ జాతర!

0
4K

ఈ జాతర కేవలం మొక్కుల పండుగే కాదు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే వేదిక

ఈనెల 4 నుండి గుంజేడులో జాతర

భారీగా తరలిరానున్న భక్తులు

ఏర్పాట్లు పూర్తి చేస్తున్న దేవాదాయ శాఖ

మహబూబాబాద్/కొత్తగూడ, మార్చి 2(భారత్ అవాజ్)::మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతం.. ప్రకృతి ఒడిలో పరవశించే ఆధ్యాత్మిక కేంద్రం గుంజేడు. ఇక్కడ కొలువైన శ్రీ ముసలమ్మ అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వనదేవత జాతర నేడు అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది.నాడు ఆదివాసీల ఇలవేల్పుగా వెలసి.. నేడు అందరి మొక్కులు తీర్చే దేవతగా కొలువు దీరిన మహిమగల తల్లి శ్రీముసలమ్మ దేవత. నిత్యం భక్తులు కోరిన కోర్కెలు తీర్చి మొక్కులు పొందుతోంది. శ్రీముసలమ్మ జాతరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ జాతర కు భారీగా భక్తులు తరలిరానున్నారు.

స్థల పురాణం ఎం చెప్పుతుంది

చుట్టూ దట్టమైన అడవి, పక్కనే సెలయేరు.. ఆహ్లాదాన్ని అందిస్తూనే ఆధ్యాత్మికత వెల్లివిరిస్తున్న కొత్తగూడ మండలం గుంజేడులో శ్రీములనమ్మ దేవత వెలసింది. నాటి మధ్యప్రదేశ్, నేటి చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా నుంచి తల్లిదండ్రులతో కలిసి శ్రీముసలమ్మ, చెల్లెలు ముత్యాలమ్మ జీవనోపాది కోసం గోదావరి దాటి ప్రాంతాలు తిరుగుతూ వస్తున్న క్రమంలో గుంజేడు ప్రాంతానికి రాగానే పిండారులు (దొంగలు) వారి నుంచి ధనం,బంగారు దోచుకునేందుకు వెంటపడ్డారు. వారితో శ్రీముసలమ్మ, ముత్యాలమ్మ పోరాడి... ముత్యాలమ్మ వీరమరణం పొందగా, శ్రీమునలమ్మ వారి (దోపిడీ దొంగల) నుంచి తప్పించుకునే క్రమంలో గుంజేదు ప్రాంతంలోని గుట్టలోకి వెళుతుంది. కొంత కాలం తరువాత తోలెం వంశీయుల కలలో కనిపించి నేను గుట్టలో కొలువై ఉన్నాను. నన్ను కొలిస్తే మీ కోరికలు తీరుస్తాను.. మీకు సుఖ, సంతోషాలు అందిస్తానుని చెబుతుంది. మరుసటి రోజు వారు వెళ్లి వెతకగా కుంకుమ భరిణి రూపంలో అమ్మవారు కనిపించారు. కుంకుమ భరణను తీసుకువచ్చి గుంజేడు వాగు సమీవంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. నాడు ఆదివాసీలు మాత్రమే పూజించే వారు. శ్రీముసలమ్మ దేవత మహిమలు ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో ప్రస్తుతం అన్ని వర్గాల భక్తులు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీముసలమ్మ దేవతను కొలుస్తున్నారు. నాటి నుంచి తోలెం వంశీయులే పూజారులుగా ఉంటున్నారు. ఆలయం పక్కనే శ్రీముసలమ్మ చెల్లెలు ముత్యాలమ్మ తల్లి గుడిని ఏర్పాటు చేశారు. ముత్యాలమ్మ దేవత వద్ద పూజలు చేసి జంతుబలి చేస్తారు. దేవాలయం సమీపంలో ప్రవహించే వాగు నీటిని తీసుకెళ్లి కొందరు ఇళ్లలో చల్లుకుంటారు. రైతులు తీసుకువెళ్లి పొలాలల్లో చల్లుకుంటే పంట మంచి దిగుబడి వస్తుందని చెబుతుంటారు.

జాతర నిర్వహణ ఇలా..

శ్రీముసలమ్మ జాతర సందర్భంగా గుంజేడు గ్రామంలో ఇళ్లకు రంగులు వేసుకుని ముగ్గులు వేసుకుని ముస్తాబు చేసుకుంటారు. మొదటి రోజు సాయంత్రం గుంజేడు గ్రామస్థులు ముత్యాలమ్మ దేవతకు బోనాలు సమర్పిస్తారు. గురువారం పడిగలు పట్టుకుని గుట్టకు వెళ్లి శ్రీముసలమ్మ దేవతను తీసుకువచ్చి గుడిలో ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు శ్రీముసలమ్మను దర్శించుకుంటారు.ముసలమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని, ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం తరహాలోనే ఇక్కడ కూడా బెల్లాన్ని (బంగారం) నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం శ్రీముసలమ్మ దేవత వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

ముస్తాబైన దేవాలయం

మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీముసలమ్మ జాతరకు దేవాలయం ముస్తాబైంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గుడి ప్రాకారానికి రంగులు వేయించారు. విగ్రహాలకు రంగువేసి ముస్తాబు చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీములసమ్మ దేవతను దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్ భూర్క సరేందర్, ఈవో అనిల్, పూజారులు తోలెం చిన్న నర్సయ్య, వెంకటేశ్వర్లు, తోలెం వెంకన్న. కిరణ్ కుమార్, తోలెం నవీన్, తోలెం రాంబాబు, స్థానిక సర్పంచ్ తోలెం అనంతరావు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం.
మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని దినసరి మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు 2026-27...
By Pagadala Venkateswar 2026-03-31 10:42:21 0 179
Andhra Pradesh
TTD: టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్.
టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్...
By Pagadala Venkateswar 2026-02-19 06:31:13 0 217
Andhra Pradesh
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 30.12.2025*   _*//నూతన సంవత్సర వేడుకలను...
By Rajini Kumari 2025-12-30 10:22:19 0 245
SURAKSHA
Retired Telangana Cops: Helping Society With New Purpose
niform తీసేసినా Telangana retired police officers బాధ్యత వదలేదు. Traffic awareness programs...
By Kalaga Sailaja 2026-07-03 10:58:50 0 96
Telangana
ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం...
By Prashanth Goindla 2026-02-09 07:19:41 0 526
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com