TTD: మార్చి 3న చంద్రగ్రహణం... భక్తులకు టీటీడీ అలర్ట్.

0
219

మార్చి 1, 2 తేదీల్లో స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నామన్న టీటీడీ

వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడి

మార్చి 3న రాత్రి 8:30 నుంచి తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయన్న టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున, రెండు రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబడవు. 

 

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆగమశాస్త్ర నియమాల అనుసరించి, గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. 

 

గ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటివాటిని టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

 

భక్తులను రాత్రి 8:30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే, మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను యథావిధిగా మార్చి 3న జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Search
Categories
Read More
SURAKSHA
S. Asker Ali IAS: Building Better Infrastructure for Progress
From a determined UPSC aspirant to Secretary, Public Works Department, S. Asker Ali, IAS, has...
By Lokeshwari Panthadi 2026-07-27 11:25:27 0 203
Telangana
మోదీ పిలుపుతో దేశభక్తి వెల్లువ.. ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర.|
● మోదీ పిలుపుతో భారీగా సాగిన తిరంగా యాత్ర ● యాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ●...
By Sidhu Maroju 2026-08-13 14:52:29 0 186
Sports
DOUBLE CENTURY FOR CAPTAIN GILL! 🤩
The first ever Asian captain to score a double-century in SENA countries! 🇮🇳 It's the dawn of a...
By Bharat Aawaz 2025-07-03 13:36:03 0 4K
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 189
Andhra Pradesh
మదనపల్లెలో పురిటిబిడ్డ మృతి: కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు.
ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్...
By Pagadala Venkateswar 2026-02-26 11:19:50 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com