మోదీ పిలుపుతో దేశభక్తి వెల్లువ.. ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర.|

0
179

● మోదీ పిలుపుతో భారీగా సాగిన తిరంగా యాత్ర

● యాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

● ఆగస్టు 15న ప్రతి ఇంటిపై తిరంగా ఎగురవేయాలని పిలుపు.

మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 13: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ పరిధిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో నడిచారు.

అల్వాల్ మీ సేవ కూడలి నుంచి ఐజీ సర్కిల్ వరకు సాగిన ప్రదర్శనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలతో ముందుకు సాగిన యాత్ర ఉత్సాహభరిత వాతావరణాన్ని తలపించింది.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

అన్ని వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులను జాతీయ భావంతో ఏకం చేయడం, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పరాంకుశం మాధవ్, చింతల మాణిక్యరెడ్డి, శ్రీనివాస్ వర్మ, అజయ్‌రెడ్డి, కార్తీక్ గౌడ్, శ్రీధర్‌రెడ్డి, తూప్రాన్ లక్ష్మణ్, బాబీ అధికారి, భోగా విష్ణుమూర్తి, రాజిరెడ్డి, మురళి, రామ్మోహన్ గౌడ్, మోయి సుజాత, కరుణ శ్రీ, పద్మిని, దేవి, ఉష తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
**సాయం చేయటం మానసిక సంతృప్తి*....
ప్రెస్ నోట్ 👏✍️ *సాయం చేయటం మానసిక సంతృప్తి*.. గిద్దలూరు పురపాలక0లోని సంజీవని అనాధ...
By Chennaiah Kati 2026-02-16 12:40:46 0 345
Andhra Pradesh
మహిళల భద్రతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యం టిడిపి రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ సచివాలయంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో...
By Benguluri Madhubabu 2026-06-02 07:56:08 0 193
Maharashtra
Leading the Charge: Maharashtra’s VVIPs Pivot to EVs
In a significant push for green energy, Deputy CM Eknath Shinde officially transitioned his...
By Dunna Jessicaruth 2026-05-15 05:39:46 0 139
SURAKSHA
Safe Hubs: How BRISP Reinvents Industrial Security
Rapid industrial growth requires robust protection, and the Baddi Region Industrial Security Plan...
By Lokeshwari Panthadi 2026-07-03 10:37:40 0 97
Andhra Pradesh
చీరాల తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం..
చీరాల: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం...
By Gadiyapudi Narendra 2026-03-03 05:50:49 0 276
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com