బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు

0
2K

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పరామర్శించారు. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను పరిశీలించిన సీఎం, బాధిత కుటుంబ సభ్యులను కలసి ఓదార్చారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన పరిహారాన్ని తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరించి సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు.

ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందని పేర్కొన్న సీఎం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
SURAKSHA
Gandam Chandrudu, IAS: A Leader in Public Governance
A Visionary Civil Servant Advancing Inclusive Development, Administrative Excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-13 06:27:57 0 226
Andhra Pradesh
ViT సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లో ప్రారంభించిన కేంద్రమంత్రి
పత్రికా ప్రకటన    *వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన...
By Rajini Kumari 2025-12-20 11:45:01 0 218
Andhra Pradesh
పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.
పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట...
By Kothuru Murali 2026-01-22 11:42:57 0 206
Andhra Pradesh
న్యూ ఇయర్ సెలబ్రేషన్ శాంతియుతంగా నిర్వహించాలి: డీఎస్పీ
గుంటూరు నగర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు వేస్ట్ డీఎస్పీ కే.అరవింద్ తెలిపారు. బుధవారం...
By John Baji 2025-12-31 11:06:34 0 275
Andhra Pradesh
కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!
కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!       దేశభక్తి...
By VALLERU SIMHADRI 2026-08-14 08:36:34 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com