Bharat Aawaz

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ

Ratna Sekhar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
2.2K
Views

వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలవాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.