మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ

0
194

మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.

 

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేత.

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 28.02.2026.

 

ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్ల సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, కూటమి నేతలు శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

 

రెడ్డిగూడెం మండలంలో 7,125 మందికి రూ.3,03,84,000లు, 

మైలవరం మండలంలోని 9471 మందికి రూ.4,07,96,000లు,

విజయవాడ రూరల్ మండలంలోని 6,957 మందికి రూ.3,02,93,500లు, 

జి.కొండూరు మండలంలోని 8,472 మందికి రూ.3,61,65,000లు, 

ఇబ్రహీంపట్నం మండలంలోని 4,719 మందికి రూ.2,02,16,500లు, 

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5,210 మందికి రూ.2,28,52,000లు మంజూరయ్యాయి.

 

మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 51 మందికి స్పౌజ్ కేటగిరి కింద మార్చి నెలకు నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన సామాజిక భద్రత పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Smart Policing: Jharkhand’s Tech-Driven Security Evolution
Jharkhand Police is undergoing a major digital transformation, shifting from legacy paper-based...
By Lokeshwari Panthadi 2026-07-04 11:26:10 0 245
Andhra Pradesh
శంఖవరంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..
శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కుట్టు మిషన్ సృష్టికర్త "విలియమ్స్...
By BABJI DADALA 2026-02-28 15:59:59 0 508
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 1K
SURAKSHA
T. N. Venkatesh: Driving Tamil Nadu's Growth Forward
A distinguished 2001-batch IAS officer of the Tamil Nadu cadre, T. N. Venkatesh has built a...
By Lokeshwari Panthadi 2026-07-20 08:28:04 0 139
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్‌లు 555...
By Pagadala Venkateswar 2026-05-28 05:27:30 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com