దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించిన కేసినేని చిన్ని

0
149

*ప్ర‌చుర‌ణార్థం* *28-02-2026*

 

*దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృషితో శాశ్వత ప‌రిష్కారం*

 

*ఎంపీ కేశినేని శివ‌నాథ్ చొర‌వ‌తో ఏ.కొండూరు మండ‌లానికి కృష్ణాజ‌లాలు*

 

*జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద కిడ్నీ బాధితులకు కృష్ణాజలాలు అందించే ప‌నులు పూర్తి*

 

*కృష్ణానది నుంచి తాగునీరు అందించేందుకు పూర్తైన పైప్‌లైన్ల ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం*

 

*మొత్తం 38 ప్రభావిత ప్రాంతాలకూ ఒకేసారి నీరు అందించేలా ఏర్పాట్లు*

 

*ఈ కార్య‌క్ర‌మాన్ని మార్చి నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు*

 

*ప్రారంభోత్స‌వానికి ముఖ్యమంత్రి సీఎం చంద్ర‌బాబు లేదా ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వచ్చే అవ‌కాశం*

 

విజ‌య‌వాడ : తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఏ.కొండూరు మండల ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృషితో కిడ్నీ బాధితుల‌కు స్వ‌చ్ఛ జలాలు అందించేందుకు జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద సూమారు రూ.50 కోట్ల తో నిర్మిస్తున్న కృష్ణా జ‌లాల ప్రాజెక్ట్ తుది ద‌శ‌కు చేరుకుంది. మండలంలోని 38 గ్రామాలకు 100 శాతం ఇంటింటా పైపు కనెక్షన్లు (FHTCలు) కల్పించే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఎప్ప‌టి క‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ సీపీడబ్ల్యూఎస్ విస్తరణ పనులు వేగ‌వంతం చేయించారు.

 

ఏ.కొండూరు మండలంలోని 38 గ్రామాల్లోని 56,481 జనాబాకు 43 పాత ట్యాంకులు (ఓ.హెచ్.ఎస్.ఆర్ లు) రిపేరు చేయించ‌టంతోపాటు, 12 కొత్త ట్యాంకులు (ఓ.హెచ్.ఎస్.ఆర్ లు) నిర్మించ‌టం జ‌రిగింది. ఇబ్రహీంపట్నం వి.టి.పి.ఎస్ కెనాల్ నందు ఫిల్టర్ చేసి ఈ 55 ట్యాంకులకు (ఓ.హెచ్.ఎస్.ఆర్ లు) శుద్ధి చేసిన నీటిని కుదప వరకు, అక్కడి నుంచి విస్సన్నపేట, గంపలగూడెం, .కొండూరు మండలంలోని 38 గ్రామాల్లో ఇంటింటికి త్రాగునీటి సరఫరా చేయబడు తుంది.

 

జ‌ల్ జ‌వ‌న్ మిష‌న్ కింద 2023 లో సూమారు 50 కోట్ల వ్య‌యంతో కృష్ణా జ‌లాల ప్రాజెక్ట్ మంజూరు కాగా, గ‌త ప్ర‌భుత్వం పూర్తి నిర్లక్ష్యంగా చేసింది. ఎన్డీయే కూట‌మి అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత ఎంపీ కేశినేని శివ‌నాథ్ కిడ్నీ బాధితుల‌కు కృష్ణాజ‌లాలు అందించాల‌నే ల‌క్ష్యంతో త‌రుచూ ఆర్.డ‌బ్ల్యూ.ఎస్ అధికారుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి..ప‌నులు వేగవంతం అయ్యే విధంగా కృషి చేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ కు ముందు ఆర్.డబ్ల్యు.ఎస్ (గ్రామీణ నీటి సరఫరా) తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ జ‌వ‌న‌రి 10వ తేదీ ఏ కొండూరు మండలం కోడూరు, పెద్ద తండా గ్రామాల్లో ప‌ర్య‌టించి స్వ‌యంగా వాట‌ర్ ట్యాంక్ నిర్మాణ ప‌నులు, నాణ్య‌త‌, పైపు లైన్ ఏర్పాట్లు స్వ‌యం పరిశీలించ‌టం జ‌రిగింది.

 

మార్చి నెల‌లోనే కృష్ణా జ‌లాల ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఎంపీ కేశినేని శివ‌నాథ్ నేతృత్వంలో ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇరువురిలో ఒకరు ప్రారంభోత్స‌వం చేసే అవ‌కాశం వుంది.

 

సీకేడీ గ్రామాలకు తాత్కాలికంగా ట్యాంకర్ నీరు

 

 ఏ.కొండూరు మండలంలో సీకేడీ ప్రభావం ఎక్కువ‌గా వున్న 21 గ్రామాలకు కుద‌ప సుంప్ నుండి 4,000 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్ల ద్వారా ప్ర‌తి రోజు తాగునీరు అందే విధంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఏర్పాట్లు చేశారు. కృష్ణాజ‌లాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు ట్యాంకర్ల‌తో మంచి నీటి సరఫరా జ‌రిగే విధంగా ఎంపీకేశినేని శివనాథ్ ఏర్పాట్లు చేశారు.

 

కృష్ణాజ‌లాలు స‌ర‌ఫ‌రా అయ్యే 38 గ్రామాలు

 

1. కుమ్మరికుంట్ల                          

2. పాత రేపూడి                                      

3. కొత్త రేపూడి                                        

4. ఈస్ట్ మాధవరం                            

5. వెస్ట్ మాధవరం

6. మెట్ట తండా

7. రేపూడి తండా

8. కృష్ణారావుపాలెం

9. మాన్సింగ్ తండా

10. కేస్య తండా

11. పెద్ద తండా

12. చైతన్య నగర్

13. చీమలపాడు

14. వెంకట తండా

15. లక్ష్మీపురం

16. దీప్లా నగర్

 17. కరుణాపురం

18. కొండూరు తండా                

19. ఎ.కొండూరు  

 20. పాత కొండూరు  

21. అట్లప్రగడ

22. గొల్లమందల

23. గొల్లమందల తండా

 24. రామచంద్రాపురం

25. కంభంపాడు

26. కోడూరు

 27. మారేపల్లి  

 28. గునిచింతలపాడు

 29. పోలిసెట్టిపాడు  

 30. కోమటికుంట  

 31. గోపాలపురం

32. వల్లంపట్ల                            

33. కొత్తూరు                            

 34. H/W ఆఫ్ హరిజనవాడ                                

35. వడ్డెర బజార్ ఆఫ్ వల్లంపట్ల

 36. జీల్లకుంట

 37. రెడ్డి బజార్ ఆఫ్ వల్లంపట్ల

 38. జానలగడ్డ

           

ఇంటింటా పైపు కనెక్షన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుండ‌టంతో ఎ.కొండూరు మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు ఈ ప్రాజెక్ట్ తో శాశ్వత పరిష్కారం చూపించినందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.

Search
Categories
Read More
Uttar Pradesh
UP Expands Metro Rail and Public Transport Network
Uttar Pradesh continues to enhance urban mobility in 2026 by expanding metro rail networks and...
By Fathima Safa 2026-07-04 11:25:56 0 42
Andhra Pradesh
చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమం
గుంటూరు నగరంలోని 47వ డివిజన్ స్థానిక గోరంట్ల ప్రాంతంలోని రామాలయం వద్ద జనసేన కార్పొరేటర్...
By John Baji 2025-12-30 01:42:25 0 192
Andhra Pradesh
పుంగనూరులో ఆలయ అంగడి గదుల కూల్చివేత, భక్తుల ఆందోళన
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో 30 ఏళ్ల క్రితం దాతలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దానం...
By Kothuru Murali 2026-04-09 07:31:58 0 132
Telangana
"గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్".|
"బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక:...
By Sidhu Maroju 2026-07-16 08:03:10 0 67
Odisha
Staff Protest Grounds "Ama Buses" in Bhubaneswar
Commuters in Bhubaneswar faced major disruptions today as 117 "Ama Bus" vehicles went completely...
By Dunna Jessicaruth 2026-05-18 10:00:35 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com