గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|

2
332

 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. 

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత సంతాన సాఫల్య కేంద్రం (IVF Centre) ద్వారా తొలి శిశువు జన్మించింది.

అల్వాల్‌కు చెందిన ఓ మహిళ ఈ అత్యాధునిక చికిత్స ద్వారా మాతృత్వాన్ని పొంది, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

అల్వాల్‌కు చెందిన విజయ (పేరు మార్చాం) (30) అనే మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కోసం గతంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఐవీఎఫ్ సేవల గురించి తెలుసుకున్న ఆ దంపతులు 2024 అక్టోబర్‌లో ఇక్కడి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు.

 

వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీన ఎమర్జెన్సీ సిజేరియన్ ద్వారా ఆమె 2 కిలోల బరువున్న ఆడశిశువుకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో ఫిబ్రవరి 25న వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

 

ఈ అద్భుత విజయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. గాంధీ ఐవీఎఫ్ బృందంలోని డాక్టర్ శోభ, డాక్టర్ సుమిత్ర నాయర్, డాక్టర్ ఫాతిమా రాణి తదితరులను ఆయన అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. 

 

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 5 నుండి 10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను పేదలకు ఉచితంగా అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం గాంధీ మరియు పేట్లబురుజు ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలోనే వరంగల్ మరియు ఆదిలాబాద్‌లకు కూడా వీటిని విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మాతృత్వం పొందలేని మహిళలకు ఇది ఒక వరమని  ఆసుపత్రి సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్.ఆర్.పి.ఎం స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
నేడు చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు...
By Vadlamudi NagaVenkat 2026-04-14 03:46:40 0 201
Andhra Pradesh
AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.
ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ...
By Pagadala Venkateswar 2026-03-02 03:29:41 0 218
Telangana
"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర...
By Sidhu Maroju 2026-05-12 09:13:09 0 612
Andhra Pradesh
బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ
*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*   *బీఆర్ నగర్ మున్సిపల్...
By Rajini Kumari 2026-03-26 13:43:48 0 256
Andhra Pradesh
మదనపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – ముగ్గురు అరెస్ట్.
మదనపల్లి తాలూకాలోని వేంపల్లి గ్రామం మల్లయ్య కొండ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-01 07:50:27 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com