Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.

0
183

2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయం

సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

6 జిల్లాల్లో మొత్తం 369 స్నానఘట్టాల ఏర్పాటుకు ప్రణాళిక

 

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాలకు సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిన్న సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కందుల దుర్గేశ్, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను ఆరు జిల్లాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి, మొత్తం 369 స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాల్లో ఈ ఏర్పాట్లు జరగనున్నాయి.

 

భక్తుల కోసం సాధారణ ధరలకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో దాదాపు కోటి మంది వరకు భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో, భద్రతకు పెద్దపీట వేయాలని తీర్మానించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
By Pagadala Venkateswar 2026-01-18 10:36:58 0 238
Andhra Pradesh
ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్
జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్‌.సి.టి.సిలో...
By Karapati Gopi 2026-01-01 05:25:05 0 836
SURAKSHA
G. Sudheer Babu IPS: Former Commissioner of Future City Police 1
# Guardian of the Future City:   The Resolute Journey of G. Sudheer Babu, IPS## A...
By Kalaga Sailaja 2026-07-11 06:04:15 0 224
Andhra Pradesh
అమరావతిలో అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహావిష్కరణకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన ఎన్డీయే కూటమి నేతలు ప్రజలు
భారత మాజీ ప్రధాని, అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన అటల్ బిహారీ వాజ్‌పేయి...
By John Baji 2025-12-25 14:04:57 0 259
Telangana
వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్...
By Sidhu Maroju 2025-09-26 08:49:23 0 342
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com