బాపట్ల తీర ప్రాంత అభివృద్ధికి అనువైన విధానాలను రూపొందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్.

0
198
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బృందం, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్. గారి నేతృత్వంలో, నాలుగు రోజుల అధ్యయన పర్యటన నిమిత్తం Goa రాష్ట్రానికి చేరుకుంది.
పర్యటనలో భాగంగా గురువారం ప్రతినిధి బృందం మొదటగా రాష్ట్ర గవర్నర్ Pusapati Ashok Gajapathi Raju గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని,
ఈ పర్యటన ఉద్దేశ్యం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాపట్ల తీర ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను వివరించింది. గౌరవ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారి దూరదృష్టితో బాపట్ల తీరాన్ని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా గోవా గవర్నర్ గారు విలువైన సూచనలు చేస్తూ, నాణ్యమైన ఆతిథ్య సదుపాయాలు, పర్యాటకులకు అనుకూలమైన వ్యవస్థలు, కొత్త తరహా పర్యాటక అనుభవాల సృష్టి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
బాపట్ల జిల్లాలో తీర ప్రాంతానికి పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
తదుపరి ప్రతినిధి బృందం గోవా పర్యాటక శాఖ అధికారులతో కలిసి Calangute Beach మరియు Baga Beachలను సందర్శించింది. అక్కడ బీచ్ షాక్ నిర్వాహకులు మరియు అధికారులతో సమావేశమై, షాక్‌ల కేటాయింపు విధానం, నిర్వహణ పద్ధతులు, సీజనల్ కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు.
అలాగే Goa Tourist Police స్టేషన్‌ను సందర్శించి, పర్యాటక పోలీసుల పాత్ర, భద్రతా చర్యలు, పర్యాటకులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ సిబ్బందితో చర్చించారు.
గోవా తీర ప్రాంతంలో రక్షణ మరియు భద్రతా చర్యలు చేపడుతున్న Drishti Marine సంస్థ ప్రతినిధులతో సమావేశమై, లైఫ్ గార్డ్‌ల నియామకం, భద్రతా ప్రోటోకాల్‌లు మరియు బాపట్ల తీర ప్రాంతంలో అలాంటి విధానాలను అమలు చేసే అవకాశాలపై చర్చించారు.
తదుపరి గోవా తీర ప్రాంత శుభ్రత బాధ్యతలు నిర్వహిస్తున్న Eco Stan Private Limited సంస్థ ప్రతినిధులు బీచ్ శుభ్రత నిర్వహణ విధానాలు మరియు ఎదురయ్యే సవాళ్లపై వివరించారు.
అదేవిధంగా, నదీ క్రూజ్‌లు, బోటింగ్ మరియు ఇతర సముద్ర పర్యాటక కార్యకలాపాలకు అనుమతులు, క్లియరెన్స్‌లు, ఎన్‌ఓసీలు జారీ చేసే విధానాలపై తెలుసుకునేందుకు Captain of Ports Department అధికారులతో సమావేశమయ్యారు.
ఈ అధ్యయన పర్యటన ద్వారా గోవా రాష్ట్రంలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, బాపట్ల తీర ప్రాంత అభివృద్ధికి అనువైన విధానాలను రూపొందించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
మహానాడులో కట్టా దొరస్వామి నాయుడు: పార్టీ బలోపేతంపై పిలుపు.
మొలకలచెరువులోని KGN ఫంక్షన్ హాల్లో బుధవారం మహానాడు మొదటి రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ...
By Pagadala Venkateswar 2026-05-28 06:43:33 0 116
Delhi - NCR
Delhi-NCR Expands Women and Child Welfare Initiatives
Delhi-NCR continues to strengthen women and child welfare through expanded healthcare, education,...
By Fathima Safa 2026-07-02 06:24:07 0 235
Andhra Pradesh
చేతబడి నెపంతో హత్య చేసిన నిందితుల అరెస్ట్
పార్వతీపురం(M) వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేశ్ను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన కొందరు...
By Boiena Rajesh 2026-06-03 02:02:38 0 237
Andhra Pradesh
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...
By Pagadala Venkateswar 2026-01-31 08:01:08 0 182
Telangana
అసిఫాబాద్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ 24వ ఇన్‌స్టలేషన్ వేడుకలు
భారత్ ఆవాజ్, అసిఫాబాద్: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్...
By Chunarkar Jagadeesh 2026-06-29 01:56:36 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com