కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్

0
2K

పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంపీ అందించిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆశ్రమం త్వరితగతిన పూర్తై వృద్ధులకు సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు.

అలాగే కాకినాడ బోట్స్ క్లబ్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘డే కేర్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పందిస్తూ, వృద్ధుల సంక్షేమం తన ప్రాధాన్యతలలో ఒకటని, వారి అవసరాలను గుర్తించి త్వరలోనే ఈ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

వృద్ధుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమావేశంలో సీనియర్ సిటిజన్ సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌లో వైభవంగా బౌద్ధ సాంప్రదాయ వర్ష వాస్ ప్రారంభోత్సవం
ఆసిఫాబాద్, జూలై 28: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో బౌద్ధ సాంప్రదాయ వర్ష వాస్...
By Chunarkar Jagadeesh 2026-07-28 15:49:11 0 378
Odisha
Odisha Agriculture and Rural Development Progress Report
Odisha’s agriculture and rural development sector has shown steady progress through...
By Fathima Safa 2026-06-25 07:14:31 0 87
Andhra Pradesh
రైతుల సమస్యలు పరిష్కరిం చెందుకు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే సుజనా చౌదరి
.అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.....
By Rajini Kumari 2026-03-28 14:22:35 0 260
Telangana
నిజామాబాద్
అబద్ధాల కాంగ్రెస్ సర్కారుపై రగులుతున్న జనాగ్రహం అణగారిన వర్గాలకు, మహిళా లోకానికి తీరని ద్రోహం...
By Sadaq Sadaq 2026-04-30 05:36:05 0 156
BMA
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen Rights
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen...
By Citizen Rights Council 2025-07-07 11:26:27 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com