పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.
పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు చెందిన రోహిత్ (21) పై కల్లూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికతో పరిచయం పెంచుకుని, ఫోన్లో వేధించి, బెదిరించి, గత నెల 28న బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడాడ్డు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 21న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది....