Search
Discover new people, create new connections and make new friends
-
-
-
-
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఘటన
అరబిందో ఫార్మా యూనిట్-15లో చెలరేగిన మంటలు
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
పరిస్థితిపై హోంమంత్రి అనిత ఆరా, సహాయక చర్యలపై ఆదేశాలు
పరవాడ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో యూనిట్-15 ప్రొడక్షన్ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను గమనించిన సిబ్బంది ప్రాణరక్షణ కోసం వెంటనే పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా రసాయన చర్య కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.14 Views -
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతం కావడంతో శుక్రవారం తిరుమల గిరులు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది.
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్వదర్శనం కోసం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 నుంచి 5 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన వారికి 5 నుంచి 7 గంటల నిరీక్షణ తప్పడం లేదు.
నిన్న (గురువారం) 65,113 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీ కానుకల రూపంలో రూ.3.82 కోట్ల ఆదాయం లభించింది. అదేవిధంగా 3.71 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది.15 Views -
ఆంధ్ర ప్రదేశ్ :
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 31 ఘర్షణలు, దాడుల కేసుల నమోదు
వాహనాల దహనం, జేసీబితో ఇల్లు కూల్చివేత
ఓ అభ్యర్థిని తరలిస్తున్న పోలీసు వాహనంపై దాడి
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు, దాడులు చోటుచేసుకోవడంతో, ఈ ఘటనలపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియలో హింసకు పాల్పడేవారు, నామినేషన్లను అడ్డుకునేవారు ఏ పార్టీకి చెందినవారైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిన్న ఒక్కరోజే 13 జిల్లాల్లో 31 ఘటనలు నమోదైనట్లు వెల్లడించారు.
ఈ ఘటనల్లో 22 హింసాత్మక ఘర్షణలు కాగా, 9 నామినేషన్ పత్రాలను చించివేయడం లేదా లాక్కోవడం వంటివి ఉన్నాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 8 ఘటనలు జరిగాయి. అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాల్లో మూడేసి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్లు సహా నాలుగు వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లు, కర్రలతో దాడులు, ఒకచోట జేసీబీతో ఇంటిని కూల్చివేయడం, గాల్లోకి కాల్పులు జరపడం వంటి ఘటనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ అభ్యర్థిని తరలిస్తున్న పోలీసు వాహనంపై జరిగిన రాళ్లదాడిలో కానిస్టేబుల్‌కు తలకు తీవ్రగాయమైంది. ఒక అభ్యర్థితో సహా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసి, 54 మంది నిందితులను గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. నిందితులు టీడీపీ, వైసీపీ, సీపీఎం, స్వతంత్రులుగా ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులను వెంటనే నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని, సున్నితమైన కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎలాంటి బెదిరింపులు లేదా హింసకు గురైనా వెంటనే డయల్ 100 లేదా 112కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.15 Views -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాఠశాల భవనం లేక విద్యార్థులు రేకుల షెడ్డు కింద చదువుకుంటున్న దుస్థితిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పాఠశాల భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే, అల్లూరి సీతారామరాజు జిల్లా డూంబ్రిగూడ మండలంలోని ఓ పాఠశాలలో సరైన భవన సదుపాయం లేదు. దీంతో అక్కడి విద్యార్థులు ఓ తాత్కాలిక రేకుల షెడ్డు కింద కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది. ఈ హృదయవిదారక దృశ్యాలను ఓ యువకుడు వీడియో తీసి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కొద్ది సమయంలోనే వైరల్‌గా మారి, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది.
ఈ పోస్ట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేశ్, సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల భవనాన్ని తక్షణమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యపై మంత్రి లోకేశ్ వేగంగా స్పందించి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.15 Views -
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి డా. అఫ్సర్ షరీఫ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటూ తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. స్థానిక సమస్యలు, పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజలతో చర్చిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.15 Views
-
మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మాలతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాలతి, రమేష్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో, అభిమానంతో ఆశీస్సులు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మష్టూరు ఎంపిటిసి గా విజయం సాధించి పార్ఠీ తనకు ఎంపిపి గా అవకాశం ఇస్తే ముష్టూరు పంచాయతీతో పాటూ మండలాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మాలతి రమేష్ తెలిపారు.11 Views
-
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ 15వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా కృషి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వార్డులోని ప్రజలను కలిసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ మాట్లాడుతూ.. 15వ వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తన విజయానికి ఐక్యంగా కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.11 Views
-
*నేడు దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ..*
*ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి*
అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యచరణ రూపొందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం *ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) నిర్వహించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.*
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. *తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, సీబీఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.* ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, పరస్పర సహకారం, సమన్వయంతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు..17 Views -
More Results