• నిజామాబాద్
    నిజామాబాద్
    0 Comments 0 Shares 52 Views 0 Reviews
  • Bahadurpura Mandal Office. Kyc process 11 : 30 AM Friday 05-06-2026
    Bahadurpura Mandal Office. Kyc process 11 : 30 AM Friday 05-06-2026
    0 Comments 0 Shares 68 Views 0 Reviews
  • ఫుడ్ పార్క్ భూముల్లో 'అక్రమాల' కలకలం!


    అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చేందుకు యత్నం?


    సర్వేను అడ్డుకుంటున్న వైనం.. ఆర్‌డీఓకు ఫిర్యాదు




    హుజూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన అగ్రికల్చర్ ప్రాసెసింగ్ జోన్ (ఫుడ్ పార్క్) భూసేకరణ ప్రక్రియ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఫుడ్ పార్క్ కొరకు మండల పరిధిలోని సర్వే నెంబర్ 1041లో ప్రభుత్వం నోటిఫై చేసిన 140 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా, ఓ కీలక ప్రభుత్వేతర అధికారికి చెందిన అసైన్డ్ భూమి విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
    హుజూర్ నగర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం విధులు నిర్వహిస్తున్న పులిచింతల నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి సదరు సర్వే నెంబర్ 1041లో దాదాపు 35 గుంటల అసైన్డ్ భూమి ఉంది. అయితే, సదరు వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఇతర ప్రైవేటు పట్టా భూములు కలిగి ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూసేకరణలో నష్టపరిహారం దక్కదనే ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుండటంతో చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సదరు అసైన్డ్ భూమిని పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా సర్వే నెంబర్ లో కలిపేసి, భూమిని ప్రైవేటు పట్టాగా మార్చుకునేందుకు వెలిదండ వీరారెడ్డి అనే వ్యక్తితో కలిసి సదరు సీఈఓ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికారులు సదరు 35 గుంటల భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ మార్గం ద్వారా భూమిని భారీ ధరకు అమ్ముకోవాలనే దురాశతోనే ఈ వ్యవహారానికి తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
    ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చే ప్రయత్నాలపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) కి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, సదరు వ్యక్తి ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అతనికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ స్థానిక అధికారులు ఈ అక్రమాలపై స్పందించకుంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
    ఫుడ్ పార్క్ భూముల్లో 'అక్రమాల' కలకలం! అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చేందుకు యత్నం? సర్వేను అడ్డుకుంటున్న వైనం.. ఆర్‌డీఓకు ఫిర్యాదు హుజూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన అగ్రికల్చర్ ప్రాసెసింగ్ జోన్ (ఫుడ్ పార్క్) భూసేకరణ ప్రక్రియ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఫుడ్ పార్క్ కొరకు మండల పరిధిలోని సర్వే నెంబర్ 1041లో ప్రభుత్వం నోటిఫై చేసిన 140 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా, ఓ కీలక ప్రభుత్వేతర అధికారికి చెందిన అసైన్డ్ భూమి విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడం స్థానికంగా కలకలం రేపుతోంది. హుజూర్ నగర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం విధులు నిర్వహిస్తున్న పులిచింతల నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి సదరు సర్వే నెంబర్ 1041లో దాదాపు 35 గుంటల అసైన్డ్ భూమి ఉంది. అయితే, సదరు వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఇతర ప్రైవేటు పట్టా భూములు కలిగి ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూసేకరణలో నష్టపరిహారం దక్కదనే ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుండటంతో చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సదరు అసైన్డ్ భూమిని పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా సర్వే నెంబర్ లో కలిపేసి, భూమిని ప్రైవేటు పట్టాగా మార్చుకునేందుకు వెలిదండ వీరారెడ్డి అనే వ్యక్తితో కలిసి సదరు సీఈఓ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికారులు సదరు 35 గుంటల భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ మార్గం ద్వారా భూమిని భారీ ధరకు అమ్ముకోవాలనే దురాశతోనే ఈ వ్యవహారానికి తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిని ప్రైవేట్ పట్టాగా మార్చే ప్రయత్నాలపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) కి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, సదరు వ్యక్తి ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అతనికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ స్థానిక అధికారులు ఈ అక్రమాలపై స్పందించకుంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
    0 Comments 0 Shares 99 Views 0 Reviews
  • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో ఉద్యోగ బంధువులు, కేంద్ర మరియు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


    ఉదయం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ:
    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం హైదరాబాద్ జిల్లా యూనియన్ ప్రాంగణంలో శ్రీ విక్రమ్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యోగుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, ఆ నాడు ఉద్యమకారుల చూపిన బాటలోనే నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


    సాయంత్రం ప్రధాన ఉత్సవాలు - కేక్ కట్టింగ్:
    సాయంత్రం జరిగిన ఉత్సవాలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు ఒక ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేయగా, ముఖ్య అతిథి మరియు ఇతర నేతల సమక్షంలో ఆ కేక్‌ను కట్ చేసి అందరికీ తీపి తినిపించారు.


    కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ ప్రసంగం:
    ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మారం జగదీశ్వర్ గారు మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగుల పోరాట పటిమను, అలుపెరగని దీక్షను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నూతనంగా ప్రతిపాదించిన ఆరోగ్య పథకం (EHS) అమల్లోకి వచ్చేలా కేంద్ర సంఘం చేసిన అగణిత కృషిని, పడిన శ్రమను ఆయన ఉద్యోగులకు వివరించారు. ఎటువంటి ప్రీమియం భారం లేకుండా స్వతంత్ర ట్రస్ట్ ఆధారిత ఈహెచ్ఎస్ రావడం ఉద్యోగుల విజయమని పేర్కొన్నారు.


    ఇదే వేదికగా ఆయన ఒక కీలకమైన పిలుపునిచ్చారు. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈహెచ్ఎస్ (EHS) పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని మరియు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని ఉద్యోగులను కోరారు. పథకం మరింత పటిష్టంగా మారేందుకు ప్రభుత్వానికి అవసరమైన సవరణలను సూచిస్తున్నామే తప్ప, పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన హెచ్చరించారు.


    ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్న డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్):
    తదనంతరం డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్రను, నాడు సకల జనుల సమ్మె కాలంలో అనుభవించిన క్లిష్ట పరిస్థితులను భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.


    పాల్గొన్న ప్రముఖులు:
    ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ట్రెజరర్ శ్రీమతి ఉమ, క్లాస్-IV కేంద్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఖాదర్ బిన్ హసన్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు శ్రీ బి. వెంకటేష్, నల్గొండ అధ్యక్షులు శ్రీ ఎన్. మురళి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ కూరాడి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీ శేఖర్ రెడ్డి, మరియు నాయకులు శ్రీ పి. వరద రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు.


    వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఖాలెద్ అహ్మద్, శ్రీ బి. శంకర్, శ్రీమతి జి. గీత, శ్రీ వైదిక్ శ్రేష్ట, శ్రీ ముఖీం ఖురేషి, శ్రీ ఎ.వి. శ్రీధర్, మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కొండల్ రెడ్డి, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి అనురాధ, శ్రీమతి వరలక్ష్మి లతో పాటు వివిధ యూనిట్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు పెద్ద సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో ఉద్యోగ బంధువులు, కేంద్ర మరియు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం హైదరాబాద్ జిల్లా యూనియన్ ప్రాంగణంలో శ్రీ విక్రమ్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యోగుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, ఆ నాడు ఉద్యమకారుల చూపిన బాటలోనే నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం ప్రధాన ఉత్సవాలు - కేక్ కట్టింగ్: సాయంత్రం జరిగిన ఉత్సవాలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు ఒక ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేయగా, ముఖ్య అతిథి మరియు ఇతర నేతల సమక్షంలో ఆ కేక్‌ను కట్ చేసి అందరికీ తీపి తినిపించారు. కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ ప్రసంగం: ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మారం జగదీశ్వర్ గారు మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగుల పోరాట పటిమను, అలుపెరగని దీక్షను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నూతనంగా ప్రతిపాదించిన ఆరోగ్య పథకం (EHS) అమల్లోకి వచ్చేలా కేంద్ర సంఘం చేసిన అగణిత కృషిని, పడిన శ్రమను ఆయన ఉద్యోగులకు వివరించారు. ఎటువంటి ప్రీమియం భారం లేకుండా స్వతంత్ర ట్రస్ట్ ఆధారిత ఈహెచ్ఎస్ రావడం ఉద్యోగుల విజయమని పేర్కొన్నారు. ఇదే వేదికగా ఆయన ఒక కీలకమైన పిలుపునిచ్చారు. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈహెచ్ఎస్ (EHS) పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని మరియు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని ఉద్యోగులను కోరారు. పథకం మరింత పటిష్టంగా మారేందుకు ప్రభుత్వానికి అవసరమైన సవరణలను సూచిస్తున్నామే తప్ప, పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన హెచ్చరించారు. ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్న డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్): తదనంతరం డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్రను, నాడు సకల జనుల సమ్మె కాలంలో అనుభవించిన క్లిష్ట పరిస్థితులను భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ట్రెజరర్ శ్రీమతి ఉమ, క్లాస్-IV కేంద్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఖాదర్ బిన్ హసన్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు శ్రీ బి. వెంకటేష్, నల్గొండ అధ్యక్షులు శ్రీ ఎన్. మురళి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ కూరాడి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీ శేఖర్ రెడ్డి, మరియు నాయకులు శ్రీ పి. వరద రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఖాలెద్ అహ్మద్, శ్రీ బి. శంకర్, శ్రీమతి జి. గీత, శ్రీ వైదిక్ శ్రేష్ట, శ్రీ ముఖీం ఖురేషి, శ్రీ ఎ.వి. శ్రీధర్, మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కొండల్ రెడ్డి, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి అనురాధ, శ్రీమతి వరలక్ష్మి లతో పాటు వివిధ యూనిట్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు పెద్ద సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    0 Comments 0 Shares 111 Views 0 Reviews
  • నిజామాబాద్:నెహ్రూనగర్‌లో ఇందిరామ ఇల్లు ఇనాగ్రేషన్ చెసినా గ్రామ సర్పంచ్
    నిజామాబాద్:నెహ్రూనగర్‌లో ఇందిరామ ఇల్లు ఇనాగ్రేషన్ చెసినా గ్రామ సర్పంచ్
    0 Comments 0 Shares 104 Views 0 Reviews
  • *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు*


    తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd


    *పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్*


    *1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో*
    - *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి.
    - *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి.
    - *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి.


    *2. పోస్టుమార్టం తప్పనిసరి*
    వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3


    *3. కావాల్సిన డాక్యుమెంట్లు*
    1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి
    2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి
    3. పోలీస్ FIR కాపీ
    4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్
    5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం
    6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక
    7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్


    *4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?*
    అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.


    *ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు*
    నిబంధన వివరణ
    **వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది.
    **టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి.
    **ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి.
    **మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది.
    **ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది.
    *పరిహారం రాకపోవడానికి కారణాలు*
    1. పోస్టుమార్టం చేయించకపోవడం
    2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం
    3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం
    4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం


    *మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
    *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు* తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd *పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్* *1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో* - *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి. - *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి. - *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి. *2. పోస్టుమార్టం తప్పనిసరి* వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3 *3. కావాల్సిన డాక్యుమెంట్లు* 1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి 2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 3. పోలీస్ FIR కాపీ 4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్ 5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం 6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక 7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్ *4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?* అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. *ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు* నిబంధన వివరణ **వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. **టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి. **ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి. **మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది. **ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది. *పరిహారం రాకపోవడానికి కారణాలు* 1. పోస్టుమార్టం చేయించకపోవడం 2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం 3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం 4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం *మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
    0 Comments 0 Shares 177 Views 0 Reviews
  • నిజామాబాద్
    నిజామాబాద్
    0 Comments 0 Shares 86 Views 0 Reviews
  • మొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారు
    మొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారు
    0 Comments 1 Shares 304 Views 0 Reviews
  • *శంషాబాద్ ఎయిర్ పోర్టు....*


    శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టు


    బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు


    నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నం


    శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజా


    పట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు


    గాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు


    *నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*


    రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు


    నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులు


    నిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత


    నిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు
    *శంషాబాద్ ఎయిర్ పోర్టు....* శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టు బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజా పట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు గాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు *నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు* రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులు నిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత నిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు
    0 Comments 0 Shares 184 Views 0 Reviews
  • పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్య


    పంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.


    ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.


    ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.


    ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
    పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్య పంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది. ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
    0 Comments 0 Shares 224 Views 0 Reviews
  • *బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…*
    *మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు*
    *సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు...
    *రవి యాదవ్ అధ్యక్షతన*
    చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
    మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు....
    ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు




    👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ:
    “బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు.
    ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ,
    “హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.....


    ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....
    *బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…* *మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు* *సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు... *రవి యాదవ్ అధ్యక్షతన* చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.... ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు 👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ: “బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు. ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ, “హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు..... ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....
    0 Comments 1 Shares 302 Views 0 Reviews
  • గాజుల రామారం డివిజన్ సమస్యలపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి గారు


    -నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.


    కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్‌లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి గారు,సాయి ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.


    డివిజన్‌లలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.


    ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీసీ వెంకట్ రామ్ గారిని బుచ్చి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల తో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
    గాజుల రామారం డివిజన్ సమస్యలపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి గారు -నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్‌లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి గారు,సాయి ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. డివిజన్‌లలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీసీ వెంకట్ రామ్ గారిని బుచ్చి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల తో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
    0 Comments 0 Shares 226 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com