పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్య


పంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.


ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.


ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.


ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.

పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్యపంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
0 Comments 0 Shares 55 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com