Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • Girl dies after falling into canal
    A. Nisha (15) of Shivarampuram village in Garugubilli (M) Mathura died after accidentally slipping into the Thotapalli canal on Monday. When her daughter, who had gone to wash clothes at the canal near the village, did not return home, her father Raju checked the area and informed the police. Police and fire personnel reached the spot, conducted a search and recovered the body. SI Fakhruddin...
    249 Views
  • ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభించనున్న బేబీనాయన
    ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10గంటలకు డొంగురువలస చేరుకుని, అమ్మవారిని దర్శించుకుని ర్యాలీగా ఎరకందొరవలసలో జరిగే సభకు చేరుకుంటారని తెలిపారు. సుమారు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. #Boiena Rajesh
    282 Views
  • రెండు తలలతో గొర్రెపిల్ల.. రెండు గంటల్లోనే మృతి
    విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబఖండి గ్రామంలో శనివారం రాత్రి రెండు తలలతో గొర్రెపిల్ల పుట్టిన విషయం తెలిసిందే. పుట్టిన రెండు గంటల వ్యవధిలోనే గొర్రె పిల్ల మరణించినట్లు యజమాని రాములు తెలియజేశారు. ఇలాంటి పిల్లను తను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. జన్యు లోపంతో పుట్టిన ఇలాంటివి బతకడం కష్టమని పశు వైద్యుడు ప్రసాద్ చెప్పారు. #Boiena Rajesh
    295 Views
  • బొబ్బిలి:నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
    బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామ ప్రజలు 4రోజులుగా నీటికొరతతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి మోటార్లు పాడైపోయి నెలలు గడుస్తున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. తాగునీటి అవసరాలకు స్కూల్ ట్యాంక్ నుంచి తీసుకెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి త్వరితగతిన మోటార్లు మరమ్మత్తులు చేసి తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు....
    314 Views
  • డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
    డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జి.విజయకన్నబాబు తీర్పు చెప్పినట్లు పట్టణ సిఐ కె.నారాయణరావు చెప్పారు. బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ వి.లోవరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. #Boiena Rajesh
    314 Views
  • లోకల్ Vs నాన్ లోకల్.. విజయనగరంలో వెలసిన ఫ్లెక్సీ
    విజయనగరం కార్పొరేషన్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. స్థానికులకే టికెట్లు కేటాయించాలన్న డిమాండ్తో పలు డివిజన్లలో శనివారం ఫ్లెక్సీలు వెలిశాయి. స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడిస్తామన్న హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో 50 డివిజన్లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 64కు పెరగడంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో 'లోకల్' నినాదం పార్టీలకు ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. దీనిపై మీ కామెంట్....
    352 Views
  • టిఫిన్ దుకాణంలో ఘర్షణ.. పరస్పర కేసులు: ఎస్ఐ
    సంతకవిటి (M) తాలాడలో జరిగిన ఘర్షణ ఘటనపై పరస్పర ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు. శుక్రవారం టిఫిన్ సెంటర్లో జరిగిన గొడవలో దాలినాయుడిపై దాడి చేశారంటూ ఆయన భార్య సన్యాసమ్మ ఫిర్యాదు మేరకు రాగోలు అభి, రాంబాబులపై కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై కులం పేరుతో దూషించి దాడి చేశారని అభి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సన్యాసమ్మ, దాలినాయుడుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైందన్నారు....
    335 Views
  • మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
    డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు చిత్రీకరించి, వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ వీడియోలు ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో రాజాం పట్టణ ఎస్ఐ ఎం.డి.సల్మాన్ బేగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Boiena Rajesh
    318 Views
  • జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి
    సాలూరు (M) ఎగువమెండంగికు చెందిన గిరిజన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. విద్యార్థి తండ్రి దనేల్ తెలిపిన వివరాల మేరకు.. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతూ కాళ్లు చేతులు కదపలేని స్థితికి చేరుకున్నాడని, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడన్నారు. ఇటీవల 10 ఫలితాలలో 503 మార్కులు సాధించాడన్నారు.మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థికి ఇలా జరగడంతో అందరూ కన్నీరుమున్నీరుగా...
    288 Views
  • తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి
    ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం కృష్ణాపురంలో శుక్రవారం చెత్త సేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయకపోతే పిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. #Boiena Rajesh
    298 Views
  • బాబోయ్ ఏనుగులు గుంపు మళ్లీ వచ్చేసింది
    మన్యం జిల్లా రైతులు ప్రజలను గడగడలాడించిన ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు వచ్చేశాయి. 8 ఏనుగుల గుంపు గురువారం సాయంత్రం కలవరాయి మీదుగా ముత్తావలస కమ్మ వలస పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి. పంట పొలాలు, కల్లాలలో ఏనుగులు సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండదేవుపల్లి, శివడవలస, కమ్మవలస ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. #Boiena Rajesh
    561 Views
  • రాజాంలో స్నేక్ క్యాచర్ ని కాటేసిన పాము
    రాజాంలోని తెలగా వీధిలో గురువారం రాత్రి పామును పడుతుండగా స్నేక్ క్యాచర్ గ్రంధి అప్పారావు పాము కాటుకు గురయ్యాడు. నాగుపాముని పట్టుకొనే క్రమంలో అతని చేయి వేలు మధ్యలో కాటు వేసిందని స్థానికులు తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెంటనే తరలించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు. అప్పారావు ఇప్పటివరకు సుమారు 150 ప్రమాదకరమైన పాములను పట్టి సురక్షిత ప్రాంతాలలో వదిలినట్లు స్థానికులు చెబుతున్నారు....
    314 Views
More Results