Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ
    మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో నిర్లక్ష్యం జరిగిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ సంబంధిత ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో విధులు సక్రమంగా నిర్వహించని స్థానిక వైద్యులు, సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన...
    104 Views
  • నందిగామలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా (ప్రముఖ న్యాయవాది )
    వడదెబ్బ నివారణ నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొందలపాటి పార్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు బందలపాటి నరసింహారావు (ప్రముఖ న్యాయవాది) ఉచిత హోమియో మందులు పంపిణీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది షేక్ కరీముల్లా పాల్గొని ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు...
    423 Views
  • వన్ మంత్ - వన్ విలేజ్ కార్యక్రమంలో ఆర్డిఓ అనిల్ కుమార్
    నందిగామ మండలం పల్లగిరి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు, గ్రామంలో ప్రజలకు రెవిన్యూ సమస్యలు పరిష్కారం చేసేందుకు ఒక నెలలో ఒక గ్రామంలో 4 సార్లు ప్రజా సమస్యలు పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని ఆర్డీవో జీ అనిల్ కుమార్ తెలిపారు, గ్రామాల్లో ప్రజలు రైతులు వారి వారి సమస్యలు గ్రామాల్లో ప్రతి గురువారం జరిగే ప్రభుత్వం...
    434 Views
  • పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మే 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు బుధవారం తెలిపారు. మరిన్ని వివరాల కోసం పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించవచ్చని సూచించారు# కొత్తూరు మురళి .
    248 Views
  • పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
    పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ నేపథ్యంలో, బుధవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో షహవార్ (592), జీవన్ రెడ్డి (584), నాగసాయిరెడ్డి (584), వై. సారిక (580) వంటి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర సెక్రెటరీ...
    243 Views
  • పుంగనూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
    అన్నమయ్య జిల్లా, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు ఈ వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు. అయితే, కొన్ని ప్రాంతాలలో టమోటా పంటకు నష్టం వాటిలినట్లు సమాచారం. ఈ ఆకస్మిక వాతావరణ మార్పు జనజీవనాన్ని తాత్కాలికంగా స్తంభింపజేసింది# కొత్తూరు మురళి .
    259 Views
  • పుంగనూరు: ఈ బోడెద్దుల విలువ ఎంతో తెలుసా...
    పుంగనూరు ఎద్దుల పరుషలో రూ. 5,50,000 విలువైన జోడెద్దులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల నుంచి వెంకటేష్ అనే రైతు ఈ ఎద్దులను బుధవారం పరుషకు తీసుకొచ్చారు. ఆరు సంవత్సరాల వయసున్న ఈ ఎద్దులతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వివిధ జాతుల ఎద్దులను కూడా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    485 Views
  • పుంగనూరు: పొంచి ఉన్న పెను ప్రమాదం కొత్తూరు మురళి
    పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై బుధవారం రాత్రి మున్సిపల్ ట్యాంక్ నిండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై నీరు పడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం వేసిన మోటార్ ను అధికారులు ఆఫ్ చేయడం మరచిపోవడంతో ట్యాంక్ నిండి, నీరు ట్రాన్స్ఫార్మర్ పై పడుతోంది. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని పరిసర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు# కొత్తూరు మురళి.
    291 Views
  • అల్లూరి వర్ధంతి: రాజు క్షత్రియ సేవ సంఘం నివాళులు
    చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజు క్షత్రియ సేవ సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని మే 7, 2026న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీష్ రాజు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి తెలుగు జాతి వీరత్వాన్ని చాటిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. యువత ఆయన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు# కొత్తూరుమురళి.
    242 Views
  • రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి
    చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు 10-05-2026 తేదీలలో ఘనంగా జరగనుంది. మొదటి రోజు ఉదయం 6 గంటలకు 101 బిందెల పసుపు నీటితో జలాభిషేకం, మహాభిషేకం, ప్రత్యేక అలంకరణ, దుర్గా హోమం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం సుగంధ ఫల పుష్పాలతో అలంకరణ, పొంగళ్ళ సమర్పణ అనంతరం, సాయంత్రం 6 గంటలకు విద్యుత్ దీపాలతో అలంకరించిన పుష్పల్లకిలో అమ్మవారిని ఊరేగించారు# కొత్తూరు...
    263 Views