Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదానానికి సోమవారం పలమనేరు మార్కెట్ నుంచి 12 టన్నుల కాయగూరలు వితరణ చేశారు. పూసల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంగాల శివరామ్ తన వంతు సహాయంగా కాయగూరలు కొనుగోలు చేసి అందజేశారు. భక్తులు స్వయంగా కాయగూరలను రధంలో నింపి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా...
    244 Views
  • అన్నమయ్య జిల్లా: డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్.
    అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు పోలీసులు సోమవారం నూతన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, పట్టణ శివారు ప్రాంతాలు, కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. పోలీసు వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా గగనతలం నుంచి పర్యవేక్షిస్తూ పేకాట శిబిరాలు, నాటుసారా తయారీ, గంజాయి రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు...
    228 Views
  • అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.
    ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు నీలాద్రి, పవన్ కుమార్ సమక్షంలో, ఎన్నికల అధికారి మహేంద్రనాయక్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం పారదర్శకంగా ఎన్నికైంది. మదనపల్లి రామారావు కాలనీ ఎంజి గ్రాండ్‌లో జరిగిన ఈ సమావేశంలో, రాజు రామ్మోహనరెడ్డి ఛైర్మన్‌గా, గడ్డం సాగర్ గౌరవ అధ్యక్షులుగా, డాక్టర్ జాన్ క్రిస్టోపర్ గౌరవ సలహాదారుగా, దిలీప్ కుమార్ అధ్యక్షులుగా,...
    224 Views
  • గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
    బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గొల్లపల్లిలో ఉన్న ఆలయం, బైపాస్ రోడ్డులో ఉన్న ఆలయం వద్ద తెల్లవారుజామున నుంచి పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారిని ఎమ్మెల్యే బేబినాయన దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణి చేశారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పూజలకు రావడంతో ఆలయాలు సందడిగా ఉన్నాయి. #Boiena Rajesh
    353 Views
  • ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్
    ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్ ఇచ్చింది కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆధారాలు లేనంత వరకే ఎవరి ఆటలైనా సాగుతాయి, ఒక్కసారి ధర్మేంద్ర సాక్ష్యాలతో Bank Statement అన్ని బయటపెట్టాక ఇక తప్పించుకోవడానికి ఛాన్స్ ఎక్కడుంది? చట్టం పేరు చెప్పి బెదిరిస్తే నిజాలు దాగవు అని ఈ దెబ్బతో అర్థమైపోయింది. ఇప్పుడు ఆధారాలు రోడ్డు మీదకు వచ్చాయి కాబట్టి, ఆవిడ గారు ఏ మొహం...
    268 Views
  • చిత్తూరు జిల్లా వీకోట : దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య
    ఉదయం మార్నింగ్ వాక్‌లో ఉండగా కత్తులతో దాడి హత్య కేసులో రౌడీ షీటర్ తమీమ్‌ను అనుమానిస్తున్న పోలీసులు ఘటనను తీవ్రంగా ఖండించి, నిరసనలకు పిలుపునిచ్చిన జర్నలిస్ట్ సంఘాలు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ...
    229 Views
  • ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ.
    ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం 'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో రూ.1000 కోట్లు విడుదల ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ. 62 కోట్ల చెల్లింపు పూర్తి కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.5,556 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ప్రక్రియను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. 'ట్రై-పార్టీ బిల్...
    252 Views
  • గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ.
    15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలలో 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం పర్యటనలో భాగంగా సింహాచలం దర్శనం, రైల్వే జోన్ అధికారులతో సీఎం భేటీ రాత్రి గూగుల్ ప్రతినిధులతో సమావేశమై విందు ఇచ్చిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ప్రపంచ...
    230 Views
  • కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ.
    మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే భారీగా పడిపోయిన మార్కెట్ ధరలు ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్...
    224 Views
  • పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు.
    ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించిన అధికారులు 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలు ఆదివారం నాటికంటే మెరుగైన సరఫరా రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశం సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశం రాష్ట్రంలో ఏర్పడిన...
    Like
    1
    254 Views