Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానం/
     భారత్ అవాజ్ మీడియా. కరీంనగర్ జిల్లా లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయం గా ముందుకు సాగుతూ కార్పొరేట్ లెవల్లో విద్యను అందిస్తున్నామంటూ గొప్పగా చెప్పుకునే విద్యాసంస్థలు దారుణాలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ప్రకారం విద్యా సంవత్సరం ఆఖరీ సంవత్సరిక పరీక్షలకు కొన్ని కార్పొరేట్ పాఠశాలలు వారి ఇష్టానుసారంగా వారి పాఠశాలలో విద్యాపకులతో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్...
    720 Views
  • నియోజకవర్గాల విభజన (Delimitation)

    ఎంపీ సీట్ల సంఖ్యను పెంచే 'డెలిమిటేషన్' ఎలా జరగాలి?

    మీ గొంతే.. భారత్ ఆవాజ్! మీ అభిప్రాయాన్ని క్లిక్ చేయండి.
    0 Votes Select an option
    716 Views
  • మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
    మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం నాణ్యతను పరిశీలించి, రసాయన విశ్లేషణ కోసం నమూనాలను సేకరించారు. దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరిచి, రాత్రి 10 గంటలకు మూసివేయాలని, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు
    228 Views
  • కేసీఆర్ మొండి అయితే నేను జగ మొండిని... కవిత
    గులాబీ గూటిలో సెగలు : కవితక్క కొత్త పార్టీ? కేసీఆర్‌ను రంగంలోకి దించుతున్న కేటీఆర్,హరీష్! ‎కవితక్క కొత్త పార్టీ ఏర్పాటుపై ఫార్మ్ హౌస్‌లో భారీ చర్చలు జరిగాయి. ఈ సందర్భంలో కేసీఆర్‌ను మళ్లీ ప్రజల్లోకి రావాలని కేటీఆర్, హరీశ్ రావు కోరినట్లు సమాచారం ‎ఆమె శక్తిని మేము ఎదుర్కోలేం… మీరు స్వయంగా రావాలి అనే సందేశంతో కేసీఆర్‌పై ఒత్తిడి పెంచుతున్నట్టు చర్చ ‎దాదాపు...
    282 Views
  • మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
    మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం నాణ్యతను పరిశీలించి, రసాయన విశ్లేషణ కోసం నమూనాలను సేకరించారు. దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరిచి, రాత్రి 10 గంటలకు మూసివేయాలని, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు
    259 Views
  • అన్నమయ్య జిల్లా ఆదాయం పెంపుపై కలెక్టర్ దృష్టి.
    మదనపల్లిలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఖజానా ఆదాయం పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆదాయ పురోగతిని సమీక్షించారు. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపల్, పంచాయతీ పనుల్లో తప్పనిసరిగా అమలు చేయాలని, బిల్లులు ప్రాసెస్ చేసేటప్పుడు...
    344 Views
  • మదనపల్లి: గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: వెంకటప్ప.
    మదనపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వి. పి వెంకటప్ప మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి 100 శాతం చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. గిరిజన కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆధార్ లేమితో...
    238 Views
  • జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్.
    మదనపల్లెలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జలధార – జలహారతి పనులను పక్కా ప్రణాళికతో, నాణ్యతగా పూర్తి చేయాలని, చెరువులు, వాగులు, కాలువల నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించి ఒక చెరువు నిండితే మరొక చెరువుకు నీరు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. పూడికతీత, కాలువల శుభ్రత, ఆక్రమణల తొలగింపును వేగవంతం చేయాలని, నరేగా కార్మికులను...
    245 Views
  • గంగమ్మ జాతరలో దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ విచారణ.
    మదనపల్లె మండలం వేంపల్లిలో ఈ నెల 13న జరిగిన గంగమ్మ జాతరలో డ్రమ్స్ వాయిస్తున్న దళితులపై ఎస్సై రామకృష్ణారెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ సభ్యులు గౌతంరాజు, డా. బాబుశ్రీపతి, బిక్షం శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. సీఐ కళావెంకటరమణ సమక్షంలో త్రీమెన్ కమిటీగా పూర్తి వివరాలు సేకరించిన కమిషన్, ఘటనపై తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.
    274 Views
  • నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.
    శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక కావడం పట్ల రాష్ట్ర చేనేత విభాగం నాయకులు బొమ్మి శెట్టి పురుషోత్తం హర్షం వ్యక్తం చేశారు. ఆయన కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి ఇది తగిన గౌరవమని పురుషోత్తం పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
    210 Views