పుంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షగురువారం రెండో రోజు కొనసాగింది. కన్వీనర్ హరిబాబు మాట్లాడుతూ బీసీల హక్కులకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో 1000 ఎకరాలు, కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కుల గణన, 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్...
పుంగునూరు మండలంలోని అడవినాదుని కుంట ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతిలోకి ప్రవేశ పరీక్ష ఈనెల 12న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుందని ప్రిన్సిపల్ రమ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ సేవ రెఫరెన్స్ నెంబర్‌తో ఇంటర్నెట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రం వద్దకు ఆదివారం ఉదయం 8:30 నిమిషాలకు విద్యార్థులు...
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్న విశ్వనాథ రోడ్డు దాటుతుండగా, తిరుపతి వైపు వెళ్తున్న కారు ఆయనను ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన విశ్వనాథను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఆడిట్ గురువారం జరిగింది. కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఆడిటర్లు డాక్టర్ ఎం. రుక్మిణి, డాక్టర్ ఎస్. గులాబ్ జాన్ రికార్డులను పరిశీలించి, నిర్వహణ విధానాలను తనిఖీ చేశారు. ఈ ఆడిట్ ఫలితంగా కళాశాలకు 'ఎ' గ్రేడ్ లభించింది. ప్రిన్సిపాల్ వై. వనజ మాట్లాడుతూ, అధ్యాపకుల కృషి వల్లే ఈ ఘనత సాధించామని తెలిపారు.
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక మోడ్రన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గంగాధర్ మృతి పట్ల పాత్రికేయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మృతదేహాన్ని గురువారం సాయంత్రం దేవళం వీధిలోని నివాసానికి తరలించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
మదనపల్లెలో ఓ మహిళ తన అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త మరో వివాహానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం భర్తతో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన కొత్తయిండ్లు, రంగారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సుమారు రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలవనుంది.
రాష్ట్ర...
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి బకాయిలను విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.2,950 కోట్లను విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల కోసం ఈ నిధులను కేటాయించగా, వాటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ...
పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు....
మదనపల్లె మండలంలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం పొన్నేటిపాలెం పంచాయితీ చిప్పిలికి చెందిన నాగిరెడ్డి (46) తన అన్న చెన్నకేశవరెడ్డిని వ్యవసాయ భూమిలో వాటా అడిగాడు. ఈ విషయమై రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహంతో అన్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు...