Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్సై
    అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఆదివారం ఎస్సై కేవీ రమణ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    335 Views
  • పార్వతీపురం జిల్లాలో గజరాజుల సంచారం
    పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గజరాజులు సంచరిస్తున్నాయి.ప్రస్తుతం ఓల్డ్ బట్టలభద్ర - ఓల్డ్ బిత్రపాడు గ్రామాల మధ్య ఏనుగుల గుంపు తిరుగుతోంది.అయితే సమీప పంట పొలాలకు రైతులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు.ఏక్షణాన ఇవి దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఏనుగుల సంచారంపై సమాచారం అందిస్తూ,అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులుకు హెచ్చరిస్తున్నారు....
    368 Views
  • పడితే ప్రాణాలు పోతాయ్..
    సాలూరు మండలం కరాసవలస పంచాయతీ పరిధిలో ఉన్న సిమిడివలస వద్ద రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడింది. రాత్రిపూట ఆ గొయ్యి కనిపించక వాహనదారులు అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. #RAJESH 
    419 Views
  • కొండవాగుతో ఏడాదికి రెండు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండలం లొద్ద పరిసర ప్రాంతాల గిరిజనలు. కొండవాగు నీటిని వడిసి పట్టుకొని తమ పొలాలకు మళ్లించుకుంటూ వరి పంటను పండిస్తున్నారు. ఎత్తు పల్లాలుగా ఉన్న భూములను చదును చేసి, పోలలుగా మార్చారు. ఎత్తున పారె నీరును తమ పొలాల్లోకి మళ్లించి ప్రతి ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లో వరి పంటను పండిస్తున్నారు.
    #RAJESH
    1 Views 494 Views
  • కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు అడిగినందుకు తల్లి, కొడుకుపై ఆదివారం సాయంత్రం దాడి చేశాడు. బసినికొండకు చెందిన నవీన్ కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన నవీన్, ఆయన తల్లి పార్వతమ్మ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    311 Views
  • హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.
    మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం, తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులోని 3వ మలుపు వద్ద స్టీరింగ్ రాడ్డు కట్ అవ్వడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.
    283 Views
  • Nara Lokesh: తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్.
    ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాలతో ఆదివారం మంగళగిరిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.   ఈ శిబిరానికి తెదేపా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 530 మందికి...
    339 Views
  • Golden Fish: పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు.
    పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి వలకు చిక్కడంతో ఒకే రోజులో లక్షాధికారులయ్యారు. వేటలో భాగంగా దొరికిన రెండు చేపలను కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురాగా, వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటాపోటీగా వేలం పాడారు.   వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు...
    467 Views
  • శరవేగంగా బూరిపేట-గంగాడ రోడ్డు పనులు
    తెర్లాం మండలం బూరిపేట నుంచి గంగాడ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. రోడ్డు పాడైపోవడంతో ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. రోడ్డు పనులు జరగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజాకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. #RAJESH 
    338 Views